HomeSportsIPL 2026: అత్యధిక ధర పలుకుతాడనుకున్నాడు.. కానీ ఓ చిన్న మిస్టేక్‌తో వేలంలో ఆశలకు బ్రేక్?

IPL 2026: అత్యధిక ధర పలుకుతాడనుకున్నాడు.. కానీ ఓ చిన్న మిస్టేక్‌తో వేలంలో ఆశలకు బ్రేక్?

IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలానికి సమయం దగ్గరపడింది. డిసెంబర్ 16న అబుదాబీ వేదికగా జరిగే ఈ వేలంలో మొత్తం 77 స్లాట్లు భర్తీ చేయాల్సి ఉండగా, 355 మంది క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో 240 మంది భారత ఆటగాళ్లు, 110 మంది విదేశీ ప్లేయర్లు ఉండటం విశేషం. ఇప్పటికే ఈ మినీ వేలంపై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ పేరు చుట్టూ హాట్ టాపిక్ నడుస్తోంది. గ్రీన్ ఈ వేలంలో తన పేరును పూర్తిస్థాయి బ్యాటర్గా నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై తాజాగా స్పందించిన గ్రీన్… ఇది తన ఉద్దేశపూర్వక నిర్ణయం కాదని, తన మేనేజర్ చేసిన చిన్న తప్పిదం వల్లే ఇలా జరిగిందని స్పష్టం చేశాడు.

తాను కేవలం బ్యాటర్ మాత్రమే కాదని, తన బౌలింగ్ కూడా మెరుగుపడిందని గ్రీన్ చెప్పుకొచ్చాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ జట్టుకు ఉపయోగపడగలనని పేర్కొన్నాడు. ఐపీఎల్ వేలంలో తన పేరు బ్యాటర్ స్లాట్‌లో రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో నమోదు కావడం తన మేనేజర్ తప్పిదమేనని అన్నాడు. బహుశా తాను బౌలింగ్ చేస్తానన్న విషయం అతడికి అంతగా నచ్చలేదేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

అయితే ఈ పొరపాటు వల్ల వేలంలో తన ధరపై ప్రభావం పడే అవకాశం ఉందని గ్రీన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగితే ఎక్కువ ధర వచ్చే ఛాన్స్ ఉండేదని, బ్యాటర్‌గా మాత్రమే నమోదు కావడం కొంత ఇబ్బందికరంగా మారవచ్చని భావిస్తున్నాడు.

గతంలో కామెరాన్ గ్రీన్ ఐపీఎల్‌లో తన సత్తా ఏంటో నిరూపించాడు. 2023లో ముంబై ఇండియన్స్ అతడిని రూ.17.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో గ్రీన్ 452 పరుగులు చేయడమే కాకుండా 6 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. అలాగే 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన గ్రీన్ 255 పరుగులు, 10 వికెట్లు తీసి మరోసారి తన విలువను చాటాడు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోనూ కామెరాన్ గ్రీన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడి ప్రస్తుత ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 2026 మినీ వేలంలో గ్రీన్ భారీ ధర పలుకుతాడన్న అంచనాలు కొనసాగుతున్నాయి. అయితే బ్యాటర్ స్లాట్‌లో నమోదు కావడం అతడి ధరపై ఎంత మేర ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవీ చదవండి: RCB stamped Issue: ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో అపశృతి.. పొలిటికల్ టర్న్?
RCB Captain: కౌన్ బనేగా ఆర్సీబీ కెప్టెన్? మెగా వేలంలో ఐదుగురిపై కన్ను!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు