Video: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ జితేష్ శర్మ చేసిన అద్భుతమైన రనౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంఎస్ ధోనిని గుర్తు చేసే విధంగా జితేష్ ప్రదర్శించిన మెరుపు స్టంపింగ్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ కీలక క్షణం వల్ల క్వింటన్ డికాక్ తన సెంచరీని మిస్ చేసుకున్నాడు.
డికాక్ సెంచరీకి అడ్డువచ్చిన జితేష్ మెరుపు కదలిక
ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియంలో డికాక్ భారత బౌలర్లను చాకచక్యంగా ఎదుర్కొంటూ 46 బంతుల్లో 90 పరుగులు చేశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న అతడు, వరుణ్ చక్రవర్తి వేసిన 16వ ఓవర్లో బంతిని తప్పుగా అంచనా వేశాడు. బంతి బ్యాట్ అంచును తాకి కీపర్ వైపు వెళ్లడంతో, క్వింటన్ క్రీజు బయటికి అడుగు వేసాడు.
అదే క్షణంలో అప్రమత్తమైన జితేష్ శర్మ, బంతిని పట్టుకున్న వెంటనే మెరుపువేగంతో వికెట్లను గిరాటేశాడు. డికాక్ క్రీజులోకి చేరకముందే బెయిల్స్ పడిపోవడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఈ రనౌట్ ధోని శైలిని తలపించిందంటూ నెటిజన్లు జితేష్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మ్యాచ్ ఫలితం
డికాక్ ఔటైనప్పటికీ దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని వేధడంలో భారత బ్యాటర్లు విఫలమవడంతో 51 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది.
ఇవీ చదవండి: Suryakumar Yadav : విరాట్, ధోనిలు సాధించలేని రికార్డు సూర్యవశం
Dhoni Relation : మహేంద్రసింగ్ ధోనితో రిలేషన్.. నటి సంచలన వ్యాఖ్యలు!
