HomeCinemaAkhanda 2: తాండవంలో హర్షాలి మల్హోత్రా.. బాలయ్యతో నటించడం కల నెరవేరినట్టే!

Akhanda 2: తాండవంలో హర్షాలి మల్హోత్రా.. బాలయ్యతో నటించడం కల నెరవేరినట్టే!

Akhanda 2: బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ divine-action చిత్రం ‘అఖండ 2: తాండవం’ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రామ్ ఆచంట–గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ హై వోల్టేజ్ సినిమా డిసెంబర్ 5, 2025న 2D, 3D ఫార్మాట్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ హర్షాలి మల్హోత్రా, మీడియాతో మాట్లాడుతూ సినిమా అనుభవాలను పంచుకున్నారు.

జనని పాత్ర చాలా స్పెషల్
హర్షాలి మాట్లాడుతూ –
“దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్లీ థియేటర్లకు వస్తున్నందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది.
ఈ సినిమాలో నేను జనని పాత్రలో కనిపిస్తాను.
ఆమె చాలా అమాయకం, కేర్ చేసే అమ్మాయి.
ఆమె లైఫ్ డేంజర్‌లో ఉన్నప్పుడు అఖండ ఆమెను కాపాడడానికి వస్తుంటారు” అని వివరించారు.

బజరంగీ భాయిజాన్ తర్వాత వచ్చిన ఆఫర్లు?
“చాలా మంచి పాత్రలు వచ్చాయి. కానీ నేనొక ప్రత్యేకమైన పాత్ర కోసం వేచి చూశాను. అఖండ 2 అవకాశం రావడం నా అదృష్టం. బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో నటించడానికి ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాను” అన్నారు.

బాలకృష్ణ అంటే ఎంతో ఇష్టం
“భగవద్గీత కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, అఖండ లాంటి ఎన్నో సినిమాలు చూశాను.
బాలకృష్ణ గారు చాలా కూల్, కేర్ చేసే వ్యక్తి. మొదట నెర్వస్‌గా ఉన్నా, ఆయన నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు.
షూటింగ్ మొత్తం ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా చూసుకున్నారు” అని హర్షాలి చిరునవ్వుతో చెప్పారు.

షూటింగ్ సమయంలో ఎదురైన చాలెంజెస్
“మైనస్ టెంపరేచర్ ఉన్న లొకేషన్లలో షూట్ చేశాం. అది చాలా టఫ్.
యాక్షన్ స్టంట్స్ చేయడం కూడా ఒక పెద్ద చాలెంజ్” అని తెలిపారు.

గ్యాప్‌లో ఏం చేసారు?
“స్టడీస్‌పై ఫోకస్ పెట్టాను. కథక్ డాన్స్ నేర్చుకున్నాను. మంచి సినిమా కోసం వేచి చూసిన నాకు ‘అఖండ 2’ మంచి బ్రేక్” అని చెప్పింది.

తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆనందం
“నా రెండో సినిమా టాలీవుడ్‌లో రావడం ఒక సంతోషం.
అంత పెద్ద యాక్టర్‌తో స్క్రీన్ షేర్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి” అని చెప్పింది.

బోయపాటి శ్రీను గురించి ఏమన్నారు?
“బోయపాటి గారు ఎంతో కేర్. నాకెక్కడైనా నెర్వస్‌గా అనిపించినప్పుడు ‘నువ్వు చేయగలవు’ అని ప్రోత్సహించేవారు. ప్రతి సీన్ తర్వాత కూడా అభినందించేవారు. జనని పాత్ర కోసం నన్ను ఎంచుకోవడం నా అదృష్టం” అని హర్షాలి తెలిపింది.

సల్మాన్ ఖాన్ జ్ఞాపకాలు – బాలయ్యతో ఫన్ మూమెంట్స్
“సల్మాన్ గారితో షూటింగ్ సమయంలో టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్లం – చాలా ఫన్.
బాలయ్య గారితో కూడా చాలా నవ్వులు, మజా.
‘ఎనర్జీ కోసం కషాయం తాగు’ అని జోక్ చేసేవారు… కానీ నాకు అల్లం అంటే అస్సలు ఇష్టం లేదు (నవ్వుతూ).”

తెలుగులో మీకు ఇష్టమైన స్టార్స్ ఎవరంటే…
“బాలయ్య గార
అల్లు అర్జున్ గారు
ప్రభాస్ గారు” అని చెప్పింది హర్షాలి

భవిష్యత్ కోరికలు

“సంజయ్ లీలా భన్సాలీ గారి సినిమాలో పని చేయాలని ఉంది. ఆయన హీరోయిన్స్‌ని చూపించే తీరు అద్భుతం. అన్ని జానర్స్‌లో కూడా మంచి లీడింగ్ పాత్రలు చేయాలని ఉంది” అని ఆమె చెప్పింది.

ఇవీ చదవండి: Akhanda 2 : బాలకృష్ణ అఖండ 2 లేటెస్ట్ అప్ డేట్ ట్రెండింగ్
Perni Nani fire on Pawan: ఇదేమైనా అఖండ సినిమానా? పవన్‌పై పేర్ని నాని సెటైర్లు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు