HomeAndhra PradeshSubha Muhurtham: పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలకు షాక్.. వచ్చే 3 నెలలు శుభ ముహూర్తాలు...

Subha Muhurtham: పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలకు షాక్.. వచ్చే 3 నెలలు శుభ ముహూర్తాలు లేవట! కారణం ఇదే…

Subha Muhurtham: పెళ్లి, గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠలు వంటి శుభకార్యాలు ప్లాన్ చేస్తున్నవారికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వేద పండితుల ప్రకారం, దాదాపు 83 రోజుల పాటు శుభ ముహూర్తాలు లేవంటూ స్పష్టమైన సూచనలు వచ్చాయి. ఈ కాలాన్ని శుక్ర మౌఢ్యమి అంటారు. దీని ప్రభావంతో పెళ్లిళ్లు సహా అన్ని శుభకార్యాలను 2026 ఫిబ్రవరి వరకు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వేద పండితులు చెబుతున్న ప్రకారం, నవంబర్ 26, 2025 నుండి ఫిబ్రవరి 18, 2026 వరకు శుభ ముహూర్తాలు లేవు. ఈ కాలం మొత్తం శుక్ర మౌఢ్యమి ప్రభావితమైన రోజులు. దీంతో శుభకార్యాలన్నీ సుమారు మూడు నెలలు వాయిదా పడనున్నారు.

ఎందుకు శుభ ముహూర్తాల లేవు?
మార్గశిర శుద్ధ షష్ఠి నుండి మాఘ బహుళ అమావాస్య వరకు మూఢమి ఉంటుంది
గురు & శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత సమీపంలోకి వచ్చే సమయంలో ఇవి బలహీనంగా ఉంటాయని జ్యోతిష్యం చెబుతుంది
ఈ రెండూ శుభకార్యాలకు ముఖ్యమైన గ్రహాలు కావడంతో వివాహాలు, గృహప్రవేశాలు, ప్రతిష్ఠలు ఈ కాలంలో చేయరాదని సూచిస్తారు
అందుకే ఈ మూడు నెలల్లో దాదాపు ఏ శుభ ముహూర్తం లేకుండా క్యాలెండర్ ఖాళీగా ఉండనుంది.

ఫంక్షన్ హాళ్ల పరిస్థితి
సాధారణంగా ప్రతి సంవత్సరం మాఘమాసం పెళ్లిళ్ల సీజన్.
ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు పూర్తిగా బుక్ అయి ఉండేవి
కానీ 2026 మాఘంలో శుక్ర మౌఢ్యమి ఉండటంతో ఈసారి బుకింగ్‌లు దాదాపు లేవని నిర్వాహకులు చెబుతున్నారు
బాజాబజంత్రిలు మోగాలంటే— మూడు నెలలు వేచి చూడాల్సిందే

మూఢమి వర్తించని పనులు
వేద పండితులు చెప్పినట్లుగా:
నిత్యకర్మలు
దైనందిన ఆచారాలు
ప్రార్థనలు
వీటికి మూఢమి ప్రభావం ఉండదు.
కేవలం శుభ ముహూర్తాల అవసరమున్న ప్రధాన కార్యక్రమాలకే ఇది వర్తిస్తుంది.

ఇవీ చదవండి: Viral: పెళ్లి ముహూర్తానికి క్షణాల ముందు ప్రమాదం… ఆసుపత్రిలోనే వధూవరుల వివాహం!
Sharwanand: ఓ ఇంటివాడైన శర్వానంద్‌.. రక్షితా రెడ్డి బ్యాగ్రౌండ్ ఇదే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు