HomeCinemaSSMB 29 Globetrotter: మహేష్‌బాబు గ్లోబ్ ట్రాటర్ గ్రాండ్ ఈవెంట్ పాస్‌లు ఇలా పొందండి!

SSMB 29 Globetrotter: మహేష్‌బాబు గ్లోబ్ ట్రాటర్ గ్రాండ్ ఈవెంట్ పాస్‌లు ఇలా పొందండి!

SSMB 29 Globetrotter: సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 (వర్కింగ్ టైటిల్: గ్లోబ్ ట్రాటర్) పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నవంబర్ 15న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” అనే పవర్‌ఫుల్ రోల్‌లో నటించడం సినిమాపై మరింత హైప్‌ క్రియేట్ చేశాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.

నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్
ఈవెంట్ కోసం ఆర్ఎఫ్‌సీలో భారీ ఏర్పాట్లు చేస్తుండగా, సినిమా యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. అభిమానులు కూడా భారీగా రానున్నారని సమాచారం. దీంతో పాస్‌ల కోసం మహేష్ బాబు అభిమానులు భారీగా రిజిస్టర్ అవుతున్నారు.

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పాస్‌లు ఎలా పొందాలి?
సినిమా యూనిట్ అభిమానుల కోసం ప్రత్యేక ఆన్‌లైన్ ప్రాసెస్‌ను విడుదల చేసింది:

1️. maheshbabufans.net వెబ్‌సైట్‌కి వెళ్లండి
అక్కడ మీ సరైన వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

2️. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక
మీ పేరుతో Exclusive Fan Badge ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది.

3️. కాంటెస్ట్‌లో పాల్గొనాలి
రిజిస్టర్ అయిన అభిమానులు ఒక చిన్న కాంటెస్ట్‌లో పాల్గొనాలి.

4️. కాంటెస్ట్ గెలిస్తే పాస్ ఇలా వస్తుంది
గెలిచిన వారికి కేవలం 5 నిమిషాల్లో ‘My Contests’ పేజీలో
Unique QR Code ఆధారిత డిజిటల్ పాస్ కనిపిస్తుంది.

5️. పాస్ క‌లెక్ట్ చేయడం
ఆ QR కోడ్‌ను చూపించి ఫిజికల్ పాస్‌ను వ్యక్తిగతంగా తీసుకోవాలి.

ఇంకా కొన్ని ముఖ్యమైన పాయింట్లు
పాస్‌లు లిమిటెడ్ — ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రాధాన్యం.
ఒక్క వ్యక్తి గరిష్టంగా 2 పాస్‌లు మాత్రమే పొందగలరు.

ఇవీ చదవండి: SS Rajamouli : రాజమౌళి బర్త్‌డే స్పెషల్: ‘బాహుబలి’ మేకింగ్ వీడియో వైరల్.. ఎపిక్ సినిమా వెనుక దాగిన రహస్యాలు!
Globe Trotter : మహేష్–రాజమౌళి సినిమాలో మరో ట్విస్ట్… ఆ స్టార్ హీరో కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు