HomeAgriculturePM Kisan: ఈ రైతులకు 21వ విడత డబ్బులు ఆగిపోనున్నాయి..! కారణం తెలుసా?

PM Kisan: ఈ రైతులకు 21వ విడత డబ్బులు ఆగిపోనున్నాయి..! కారణం తెలుసా?

PM Kisan: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రైతులకు 20 విడతలుగా నిధులు విడుదల కాగా, ఇప్పుడు 21వ విడత వచ్చే సమయం దగ్గరపడింది. అయితే ఈ విడతలో కొన్ని వేల మంది రైతులకు డబ్బులు నిలిచిపోనున్నాయని సమాచారం.

రైతులకు వ్యవసాయంలో సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019లో ప్రారంభించింది. సంవత్సరానికి మూడు సార్లు రూ.2,000 చొప్పున, మొత్తం రూ.6,000 మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. కానీ, ఈ సారి కొన్ని టెక్నికల్‌ కారణాల వల్ల అందరికీ డబ్బు రాకపోవచ్చు.

ఎవరికి పీఎం కిసాన్ డబ్బులు ఆగిపోతాయి?

✅ e-KYC పూర్తి చేయని రైతులు:
పీఎం కిసాన్ స్కీమ్‌లో నమోదు ఉన్నప్పటికీ, eKYC పూర్తి చేయని వారికి ఈ విడత డబ్బులు అందవు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు eKYC చేయాలని సూచించినా, ఇప్పటికీ చాలా మంది రైతులు పూర్తి చేయలేదు.

✅ ఆధార్–బ్యాంక్ లింక్ లేకపోవడం:
రైతుల బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయకపోతే పథకం కింద నిధులు జమ కావు. ఆధార్ ద్వారా eKYCతో పాటు భూమి పత్రాలను తిరిగి సమర్పించడం కూడా తప్పనిసరి.

✅ కుటుంబంలో ఇద్దరికి పీఎం కిసాన్ రాదు:
భర్త–భార్య ఇద్దరికీ వ్యవసాయ భూమి ఉన్నా, ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ రాయితీ లభిస్తుంది. ఇద్దరికీ వస్తే డూప్లికేట్‌ ఖాతాగా పరిగణించి, చెల్లింపులు నిలిపివేస్తారు.

✅ తల్లిదండ్రుల నుండి భూమి బదిలీ అయిన వారికీ రాదు:
తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారి పేరుతో ఉన్న భూమిని పిల్లల పేరుకు మార్చినప్పటికీ, పిల్లలు పథకానికి అర్హులు కారు.

✅ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అనర్హులు:
ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పంచాయతీ చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ పదవులు ఉన్న వారు, నిపుణులు, అలాగే ఇన్‌కమ్‌ టాక్స్‌ చెల్లించే రైతులు ఈ పథకానికి అర్హులు కారు.

కేంద్రం హెచ్చరిక
పీఎం కిసాన్ లబ్ధిదారుల వివరాల్లో గల పొరపాట్లు, eKYC లోపాలు ఉన్న రైతులకు ఈ విడత డబ్బులు రాకపోవచ్చు. అందువల్ల రైతులు వెంటనే eKYC, ఆధార్ లింకింగ్, భూమి పత్రాల ధృవీకరణ పూర్తి చేయాలని కేంద్రం సూచించింది.

ఇవీ చదవండి: PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి.. డబ్బు వచ్చిందో లేదో ఇలా చెక్‌ చేసుకోండి..
PM Kisan amount: పీఎం కిసాన్‌ సొమ్ము రెండింతలు? రాజస్తాన్‌లో మాత్రమేనా? దేశమంతా పెంచుతారా? క్లారిటీ ఇదే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు