HomeCinemaTollywood: రూ.1,200 కోట్ల ఆస్తులున్న స్టార్ హీరో.. క్యాన్సర్‌ పిల్లల కోసం కీలక నిర్ణయం!

Tollywood: రూ.1,200 కోట్ల ఆస్తులున్న స్టార్ హీరో.. క్యాన్సర్‌ పిల్లల కోసం కీలక నిర్ణయం!

Tollywood: తన నటనతో పాటు వ్యాపారంలోనూ రారాజుగా పేరొందిన ఓ స్టార్ హీరో తన మంచి మనసుతో మళ్లీ చర్చలోకి వచ్చాడు. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఇప్పటికే సుమారు ₹1200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టిన ఈ హీరో, తాజాగా తన హృదయాన్ని తాకే నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

“ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న” అనే మాటను అక్షరాలా నిజం చేశారు ఆయన. రామాయణ్‌ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ నటుడు, తన పారితోషికం మొత్తాన్ని క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారుల చికిత్స కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

వివేక్ ఓబెరాయ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించగానే సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దంగల్‌ ఫేమ్‌ నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘రామాయణ్‌’ లో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్నారు. ఈ భారీ చిత్ర బడ్జెట్‌ రూ. 4000 కోట్లుగా నిర్ణయించబడింది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి పార్ట్‌ వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుండగా, రెండో భాగం 2027లో విడుదల కానుంది.

ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఓబెరాయ్ మాట్లాడుతూ, “నా జీవితంలో చేసే ప్రతి పని ప్రేమతోనే చేస్తాను. రామాయణ్‌ సినిమాకు గానూ నాకు వచ్చే రెమ్యునరేషన్‌ మొత్తాన్ని క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లల చికిత్సకు విరాళంగా ఇస్తాను. నిర్మాత కూడా నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. నాకు డబ్బు అవసరం లేదు, కానీ పిల్లల ఆరోగ్యం కోసం ఏదైనా చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను,” అని చెప్పారు.

వివేక్‌ ఈ మాటలు విని సినీ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘రక్త చరిత్ర’, ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుపరిచితుడైన వివేక్‌ ఓబెరాయ్‌ ఈ చర్యతో మళ్లీ అందరి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు.

ఇవీ చదవండి: Hit Movies : 25 కోట్లతో తీసిన సినిమా.. 340 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్
OTT Movies: ఎంటర్‌టైన్మెంట్ పండగలా.. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు