PM Modi–Denmark PM Phone Call: భారత ప్రధాని నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని మేటే ఫ్రెడరిక్సన్ శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇన్నోవేషన్, విద్యుత్ ఉత్పత్తి, నీటి నిర్వహణ, ఆహార ప్రాసెసింగ్, సుస్థిర అభివృద్ధి వంటి కీలక రంగాల్లో కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.
ప్రస్తుతం డెన్మార్క్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష దేశం, అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యదేశంగా ఉన్నందుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
చర్చలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం రావాలని, ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ స్పష్టం చేశారు.
అదేవిధంగా, ఇండియా–యూరోపియన్ యూనియన్ ఉచిత వాణిజ్య ఒప్పందం (India-EU FTA) త్వరగా పూర్తవ్వాలని డెన్మార్క్ ప్రధాని బలమైన మద్దతు తెలిపారు. 2026లో భారత్ నిర్వహించనున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ సంభాషణతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, పర్యావరణ భాగస్వామ్యం మరింత బలపడనుంది.
ఇవీ చదవండి: PM Modi Birthday : మోదీ 75వ బర్త్ డే.. ఆయన జీవితంలో టాప్ 10 విశేషాలు
PM Modi: RSS చీఫ్ 75వ పుట్టినరోజు సందర్భంగా మోదీ ప్రత్యేక వ్యాసం
