Amazon Great Indian Festival 2025: పండుగ సీజన్‌కి ముందే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 (Amazon Great Indian Festival Sale 2025) వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లతో రాబోతోంది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు అందించనుంది. ముఖ్యంగా Xiaomi, Poco, Redmi ఫోన్‌లపై ప్రత్యేక డీల్స్ ఉంటాయని అమెజాన్ ఇప్పటికే హింట్ ఇచ్చింది.
ఈ సేల్‌లో ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI, ఎక్స్చేంజ్ ఆఫర్లు వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దీంతో కస్టమర్లు మరింత సొమ్ము సేవ్ చేసుకోవచ్చు.
Xiaomi 15 స్పెషల్ డీల్
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Xiaomi 15 ఈ సేల్‌లో తక్కువ ధరలో లభించనుంది. దీని అసలు ధర ₹64,999 కాగా, ఆఫర్‌లో కేవలం ₹59,999కి దొరుకుతుంది. అంటే సూటిగా ₹5,000 సేవ్ చేసుకోవచ్చు.
డిస్‌ప్లే: 6.36 అంగుళాల AMOLED CrystalRes స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్: Snapdragon 8 Elite
కెమెరా: 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ + 32MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: రోజంతా సరిపడే బ్యాకప్
₹60,000 లోపు హై-ఎండ్ ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇది అద్భుతమైన ఆప్షన్ అవుతుంది.
ఇవీ చదవండి: Price Drop: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో నథింగ్ ఫోన్స్‌పై భారీ ఆఫర్స్
Galaxy S25 FE : సామ్‌సంగ్ Galaxy S25 FE, కొత్త టాబ్లెట్లు ఆఫర్లలో!
