HomeSportsAsia Cup 2025: 5+3+3 ఫార్ములాతో పాక్‌పై బరిలోకి భారత్!

Asia Cup 2025: 5+3+3 ఫార్ములాతో పాక్‌పై బరిలోకి భారత్!

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో అసలు క్లాసిక్ పోరు రానుంది. ఆదివారం పాకిస్తాన్‌తో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. యూఏఈపై తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు హై-వోల్టేజ్ క్లాష్‌లో పాకిస్తాన్‌ను ఢీకొట్టేందుకు రెడీగా ఉంది. అభిమానులు కూడా ఈ సూపర్ సండే మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. Asia Cup 2025

ప్రస్తుతం అందరి ప్రశ్న – భారత ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? అనే అంశం. దీనికి సమాధానం చెప్పిన మాజీ క్రికెటర్ అజయ్ జడేజా, భారత్ 5 బ్యాట్స్‌మెన్, 3 ఆల్‌రౌండర్లు, 3 బౌలర్లతో బరిలోకి దిగుతుందని తెలిపారు.

అజయ్ జడేజా వ్యాఖ్యలు
జడేజా ప్రకారం, యూఏఈతో ఆడిన జట్టులో ఎటువంటి మార్పులు ఉండవు. అదే జట్టు పాకిస్తాన్‌తో కూడా బరిలోకి దిగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. UAE మ్యాచ్ ముందు సోనీ నెట్‌వర్క్‌లో మాట్లాడుతూ, 8 మంది బ్యాటర్లను ఆడించాల్సిన అవసరం లేదని, కానీ ఆ లైన్‌అప్‌నే కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI

బ్యాట్స్‌మెన్: శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్)

ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్

బౌలర్లు: కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

ఈ కాంబినేషన్‌తో భారత్ పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది. ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు కౌంట్‌డౌన్ ప్రారంభించారు.

ఇవీ చదవండి: Asia Cup 2025 : హాంకాంగ్ పై అఫ్గానిస్థాన్ సంచలనం.. ఆసియా కప్‌లో రికార్డులు!
Video: నెట్స్‌లో రోహిత్ శర్మ తుపాకీ షాట్లు.. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు హిట్‌మ్యాన్ ఫైర్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు