HomeAndhra PradeshAP High Court : చిరుత దాడిలో చిన్నారి మృతి.. కుటుంబానికి రూ.15 లక్షలు!

AP High Court : చిరుత దాడిలో చిన్నారి మృతి.. కుటుంబానికి రూ.15 లక్షలు!

AP High Court : తిరుపతి: చిరుత దాడిలో చిన్నారి మృతి – కుటుంబానికి ₹15 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశం.. తిరుపతి అలిపిరి నడక మార్గంలో జరిగిన చిరుత దాడి ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2023 ఆగస్టు 12న అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుత దాడి జరగగా, ఆమె దుర్మరణం పాలైంది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన లక్షిత కుటుంబానికి ₹15 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు టిటిడిని ఆదేశించింది. (AP High Court)

ఈ ఘటనపై టిటిడి పాలమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తిరుమలకు నడక మార్గంలో భక్తులకు వన్యప్రాణుల దాడుల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, టిటిడి, అటవీ శాఖ అధికారులతో పాటు వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ రక్షణ చర్యలపై సిఫార్సులు చేసి, వాటి అమలును పర్యవేక్షించాల్సి ఉంటుంది.

అదే సమయంలో తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రత కోసం ఇప్పటికే చేపడుతున్న చర్యలను బలోపేతం చేయాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి: Tirumala Chirutha: తిరుమలలో బోనులో చిక్కిన చిరుత.. లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే పట్టుబడిందన్న ఈవో ధర్మారెడ్డి
Tirumala Samacharam 12-08-2023: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు