శనివారం, 19 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Vishal health: విల్లుపురంలో హీరో విశాల్‌కు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 12 మే 2025

Vishal health: తమిళ సినీ నటుడు విశాల్ (Vishal health) తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మే 11, 2025 రాత్రి కూవాగంలోని కూత్తాండవర్ ఆలయంలో చిత్తిరై (తమిళ మాసం) వేడుకల్లో భాగంగా జరిగిన ‘మిస్ కూవాగం 2025’ అనే ట్రాన్స్‌జెండర్ల కార్యక్రమంలో జరిగింది. విశాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కార్యక్రమంలో వేదికపై ఉండగా విశాల్ ఉన్నట్టుండి స్పృహ తప్పి కిందపడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది ప్రథమ చికిత్స అందించడంతో ఆయన కొంత కోలుకున్నారు. అనంతరం మాజీ మంత్రి పొన్ముడి సహాయంతో విశాల్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అవసరమైన వైద్య పరీక్షలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇటీవల విశాల్ ‘మద గజ రాజా’ సినిమా ప్రమోషన్స్‌లో నీరసంగా కనిపించడం, ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు గతంలో షూటింగ్‌లలో ఫైట్ సీన్స్ సమయంలో తలకు తగిలిన గాయాలు ఈ అస్వస్థతకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి కచ్చితమైన వైద్య కారణాలపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
విశాల్ అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో కోరుకుంటున్నారు. ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి: Vishal: విశాల్ ప్రేమాయణంపై రూమర్లు.. నిజం కాదన్న నటి!
Balakrishna: తన సినిమా ప్లాప్‌ కావడంపై అప్పట్లో బాలకృష్ణ ఏమన్నాడంటే..

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading