Andhra Pradesh : గడచిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం (TDP), జనసేన (Janasena), రాష్ట్ర (Andhra Pradesh) బీజేపీ (BJP) కలిసి పోటీ చేసి ఎన్నడూ లేని విధంగా తిరుగులేని విజయం సాధించాయి. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్ (YS Jagan) ను కేవలం 11 సీట్లకే పరిమితం చేశాయి. మరి అంతటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ తర్వాత ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టాలి. కానీ ఏపీలో అది జరగడం లేదంటున్నారు విశ్లేషకులు.
2014 ఎన్నికల ముందు..
2014లో ఇదే కూటమి (TDP Kutami) పోటీ చేసి గెలుపొందాయి. అప్పుడు జగన్ (Jagan) కు 67 సీట్లు వచ్చి ప్రధాన ప్రతిపక్ష నేతగా కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత 2018లో బీజేపీ నుంచి టీడీపీ విడిపోయింది. ప్రధాని మోదీని (PM Modi) నాటి సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) తూలనాడారు. ప్రధాని సైతం ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) ఏటీఎంగా మార్చుకుని అవినీతికి పాల్పడ్డారంటూ దుయ్యబట్టారు. 2019 సార్వత్రిక (Elections) ఎన్నికల ముందు కూడా నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. ఒంటరిగానే పోటీ చేశారు. సీన్ కట్ చేస్తే ల్యాండ్ స్లైడ్ విక్టరీ దక్కింది. 151 సీట్లతో రాష్ట్ర (Andhra Pradesh) చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా జయకేతనం ఎగురవేశారు.
అధికారం చేపట్టిన జగన్ ఏం చేశారు?
2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న వైయస్ జగన్.. రాగానే తన మేనిఫెస్టో, ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టారు. అధికారంలోకి రాగానే మొట్ట మొదటి సంతకం అవ్వాతాతలకు పింఛన్లపై చేశారు. తర్వాత తన మేనిఫెస్టోలో వరుసగా హామీలు నెరవేరుస్తూ వచ్చారు. మొదటగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, వాలంటీర్ల నియామకం, ఇంటికే సంక్షేమ పథకాలు, బటన్ నొక్కడం.. ఇలాంటివి అమలు చేశారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించి తొలి ఏడాదిలోనే దాదాపు 90శాతానికి పైగా హామీలు ఇంప్లిమెంట్ చేశారు.
కక్ష సాధింపులు లేవు
అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్.. కక్ష సాధింపులు గానీ, హత్యా రాజకీయాలు ప్రేరేపించడం గానీ, ఇప్పుడు అమలవుతున్నట్టుగా రెడ్ బుక్ రాజకీయం గానీ చేయలేదు. కేవలం మొదటి రెండు మూడేళ్లు ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో (Andhra Pradesh) అభివృద్ధి కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టారు. మూడో ఏడాది తర్వాత అంతకు ముందు ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలున్న నేతలపై ఫోకస్ పెట్టారు. చట్టప్రకారం అరెస్టులు జరిగాయి. ఇందులో భాగంగా మంత్రులుగా పని చేసిన వారి అరెస్టులు, ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు అరెస్టు కూడా జరిగింది. ఇది అప్పట్లో సంచలనం.
మరి ఇప్పుడు?
2014లో కలిసి 2018లో విడిపోయిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. 2024 ఎన్నికల సమయానికి మళ్లీ జతకట్టింది. మూడు పార్టీలూ ఏకమయ్యాయి. దానికి తోడు వైయస్ జగన్ సోదరి షర్మిల ఆయనపై రివర్స్ అయ్యింది. కుటుంబంలో తగాదాలు వీధికెక్కాయి. కానీ జగన్ మాత్రం వెరవలేదు. ఒంటరి పోరాటానికే సిద్ధమయ్యారు. సిద్ధం సభలతో హోరెత్తించారు. జనం తనవైపే ఉన్నారని, ధర్మయుద్ధంలో తనదే గెలుపని ధీమాగా ఉన్నారు. కానీ అందరూ ఏకమై జగన్ ను ఓడించారు. 11 సీట్లకే పరిమితం చేశారు. జనసేనకు 21, బీజేపీకి 8, టీడీపీకి 135 సీట్లు దక్కాయి.
ప్రభుత్వం మారగానే..
కూటమి ప్రభుత్వం రాగానే రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వైయస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, హత్యలు, హత్యాయాత్నాలు జరిగాయి. అప్పటి దాకా అమలైన సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. సూపర్ సిక్స్ (Super six) మేనిఫెస్టో పథకాలు అరకొరగానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి మూడు నెలలు లేదా ఆరు నెలలు ఇలాంటి పరిణామాలు సహజమే అనుకున్నారు. కానీ, ఆరు నెలలు దాటినా, ఏడాది కావస్తున్నా పరిస్థితుల్లో మార్పులు లేవు. నేతల అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, స్టేషన్ల చుట్టూ తిప్పడాలు, ప్రశ్నించిన వారిపై దాష్టీకం కొనసాగిస్తూనే ఉన్నారన్న ఆరోపణలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి.
ఏడాది కావస్తున్న జగన్ పేరు ఎత్తని రోజు లేదు
ఏడాది పాలన పూర్తి కావస్తున్నా కూటమి పార్టీలకు, ఆ రెండు పత్రికలకు, అరడజను పైగా ఆ టీవీ ఛానళ్లకు రోజూ జగన్ పేరు ఎత్తనిదే పూట గడవదు. వైయస్ జగన్ ప్రభుత్వం లేదా, వైయస్సార్ సీపీపై ఏదో ఒక కథనం రాయనిదే సంతృప్తిగా ఉండదు. జగన్… జగన్… జగన్.. ఇదే తంతు. జగన్ పేరు పలకకుండా ఈ 11 నెలల పాలనలో ఏ ఒక్కరోజూ వారికి గడవలేదంటే ఆశ్చర్యం లేదు. ప్రతి రోజూ ఆ రెండు పత్రికల్లో జగన్ పేరు ఉండాల్సిందే. ఏదో ఒక స్కామ్ జరిగిందని రాస్తూ అందులో జగన్ ఇరికించాల్సిందే.
ఏడాది పాలన ఎంత వ్యత్యాసం?
తొలి ఏడాదిలో 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చిన జగన్ పాలన, సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన పాలనతో నేడు కూటమి ఏడాది పాలనను రాజకీయ విశ్లేషకులు కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటి నుంచి కేవలం జగన్, ఆయన పార్టీ నేతలు, సోషల్ మీడియాలో ప్రశ్నించే వారు మాత్రమే టార్గెట్ గా పాలన సాగిస్తున్నారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
మునుపటి తప్పే మళ్లీ చేస్తున్నారా?
జగన్ కాంగ్రెస్ పార్టీని వీడేలా చేసిన పరిస్థితులు, ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ ఏకమై ఆయనపై పెట్టిన కేసులు, జైలుకు పంపడం, రూ.లక్ష కోట్లంటూ అవినీతి ఆరోపణలు చేయడం, అసెంబ్లీలోనూ మైక్ ఇవ్వకుండా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేయడం, ఇవన్నీ జగన్ ను ప్రజల దృష్టిలో హీరోను చేశాయి. ఎంత అణగదొక్కితే అంత పైకి ఎదుగుతున్నాడన్న విషయం ఇప్పటికీ నేటి పాలకులకు అర్థం కావడం లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆధారాలు ఉండి అవినీతి ఆరోపణలు చేయడం, లెక్కాపత్రాలతో, ప్రాపర్ స్టాటిస్టిక్స్ తో విమర్శిస్తే అర్థం ఉంటుంది.
కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసమో, బురదజల్లాలనే ఉద్దేశంతోనో, జగన్ క్యారెక్టర్, ఆయన కుటుంబ సభ్యులను అసభ్యంగా తూలనాడించడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తే అది వారి మెడకే చుట్టుకుంటుందని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. జగన్ పై పసలేని ఆరోపణలు చేస్తూ, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే పైసా ఉపయోగం లేదని, ఆయనకంటే మెరుగైన పాలన, సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించి విమర్శలు చేస్తే ప్రజలు కూడా గమనిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమం, అభివృద్ధితో పోటీ పడకుండా కేవలం ఫేక్ విమర్శలు, క్యారెక్టర్ అసాసినేషన్, నేతల అరెస్టులతో భయపెట్టాలని చూస్తే జగన్ జడిసే రకం కాదన్నది గుర్తుంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: YS Jagan Meeting : తెగువ ఎలా ఉంటుందో చాటి చెప్పారు : వైయస్ జగన్
YS Jagan : అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్: జగన్ ధ్వజం
YS Jagan Mohan Reddy: పప్పు బెల్లాల్లా పోర్టులు, మెడికల్ కాలేజీల అమ్మకం
