Supreme court on Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వి విశ్వనాథన్ ధర్మసనం విచారణ జరిపింది. లడ్డు వివాదంలో సీఎం బాబు వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ల్యాబ్ లో తేలిన మీ వద్ద ఆధారాలు ఉన్నాయా ? అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఇంకా ఏమందంటే.
– నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా
– ఇదంగా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా
– దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దు
– మీరు మీడియా కు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా
– రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా
– జూలై లో రిపోర్ట్ వచ్చింది…సెప్టెంబర్ లో మీరు మీడియాలో చెప్పారు ఎందుకు
– సిట్ ఎందుకు వేశారు
– వెంటనే మీడియాకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి ?
– కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారు
– టెస్టు రిపోర్టు రిజెక్ట్ చేసినప్పుడు వాడే పరిస్థితి ఎక్కడ ?
– నెయ్యి వాడినట్లు రుజువు ఉందా ?
– నెయ్యి సప్లయి చేసే కాంట్రాక్టర్లు ఎంత మంది ?
– అయిదుగురు కాంట్రాక్టర్లు సప్లయి చేసిన నెయ్యిని మిక్స్ చేసిన తర్వాత ఎలా ?
– నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు లేవు
– ఒకసారి మిక్స్ చేసిన తరవాత మీరు ఎవరిని ఎలా గుర్తిస్తారు
– సిట్ ఎప్పుడు వేశారు ? సీఎం ఎప్పుడు మీడియాకు వెళ్లారు ? అని సుప్రీం ప్రశ్నించింది.
మరోవైపు రిజెక్ట్ చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ప్రసాదంలో వాడలేదని టీటీడీ తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వెల్లడించారు.
ఇవీ చదవండి: Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
YS Jagan Decleration: జగన్ తిరుమల పర్యటన రద్దు.. డిక్లరేషన్‌పై ఎందుకీ వివాదం?
YS Jagan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైయస్సార్ సీపీ
