HomeCinemaDevara Review: దేవర సినిమా రివ్యూ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ ఎలా ఉందంటే..

Devara Review: దేవర సినిమా రివ్యూ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ ఎలా ఉందంటే..

Devara Review: ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర (Devara) మూవీ (Devara Movie Review) రానే వచ్చింది. ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా నటించిన సినిమా రిలీజ్ కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద భారీ ఫ్లెక్సీలు, పూలదండలతో దేవర జాతరను తలపించేలా అభిమానులు రచ్చ చేశారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం విడుదల కావడంతో దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కొరటాల శివ గత చిత్రం ఆచార్య (Acharya) మూలాలు అక్కడక్కడా కనిపించాయా? దేవర ద్విపాత్రాభినయం మెప్పించిందా? జాన్వీ అందచందాలతో అలరించిందా? సైఫ్ నటన ఎలా ఉంది? కథ నడిపించడంలో, దర్శకత్వంలో కొరటాల (Koratala Siva) మార్క్, సాంకేతికత ఎలా వినియోగించారు? మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

నటీనటులు: జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, శృతి మరాఠే, ఇతర నటులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: రత్నవేలు

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్, నందమూరి కల్యాణ్ రామ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ

కొన్నాళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇండియా మొత్తాన్ని కుదిపేస్తున్న ఎన్టీఆర్ మానియా దేవర అని చెప్పొచ్చు. ఇటీవల ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో జరిగాయి. తెలుగులో అతిపెద్ద చిత్రం కల్కి తర్వాత విడుదలైన మూవీ కావడంతో ఈ చిత్రంపై అందరి దృష్టి పడింది.

కథ ఎలా ఉందంటే..
ఎర్రసముద్రంలో దేవర (జూ.ఎన్టీఆర్) చెప్పిందే వేదం. నాలుగు గ్రామాలకు ఆయన మాట శాసనం. అక్కడి వాళ్లకు సముద్రమే జీవనాధారం. సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డ్‌కు తెలియకుండా దించేస్తుంటారు. నాలుగు ఊళ్ల ప్రజల కోసం తన ప్రాణాలైనా ఇచ్చేంత ధైర్యం దేవర సొంతం. అదే ఊరిలో భైర (సైఫ్ అలీ ఖాన్) (Saif Ali Khan) ఉంటాడు. దేవర చేసే పనులు మాత్రం ఈయనకు నచ్చేవి కాదు. అయితే, దేవర సపోర్ట్ లేకుండా తాను ఏమీ చేయలేనని భైరకు బాగా తెలుసు.

సమయం కోసం వేచి చూస్తుంటా భైర. కొన్నాళ్ల తర్వాత తాము చేసేదంతా తప్పని దేవర తెలుసుకుంటాడు. తన వాళ్లను కూడా సముద్రంలోకి ఈ పనుల కోసం వెళ్లొద్దంటూ స్పష్టం చేస్తాడు. అయతే, సరుకు తీసుకోవడానికి, డబ్బుకు అలవాటు పడినక ఊరివాళ్లు దేవర మాట లెక్కచేయరు. భైరాను తోడుగా తీసుకెళ్దామని అనుకుంటారు. కానీ సముద్రంలోకి వెళ్లిన వాళ్లను అక్కడే సమాప్తం చేస్తుంటాడు దేవర. ఇలా కొన్నాళ్లు గడిచాక దేవర ఊరికి దూరంగా వెళ్లిపోతాడు. ఇంతటి ధైర్యవంతుడైన దేవరకు వర (ఎన్టీఆర్) లాంటి పిరికి వాడు కొడుకుగా ఉంటాడు.

ఇక్కడ ఎన్టీఆర్ రెండో క్యారెక్టర్ పరిచయం అవుతుంది. అదే ఊళ్లో ఉండే రాయప్ప (శ్రీకాంత్) కుమార్తె తంగం (జాన్వీ కపూర్) (Janhvi Kapoor) వరను లైక్ చేస్తుంటుంది. దేవర అంతటి ధైర్యవంతుడైనా వర ఎందుకు పిరికివాడుగా భయపడుతుంటాడు, ఊరి సమస్యలు తీర్చేందుకు దేవర దూరం నుంచే తన పని చేస్తుంటాడా? అసలు ఏం జరిగిందన్నది మిగతా కథ సినిమాలో చూడాల్సిందే.

కథనం ఎలా ఉందంటే..
దర్శకుడు కొరటాల శివ మూవీ అంటేనే కమర్షియల్ లో సామాజిక సందేశం కలిపి కొట్టేస్తుంటాడన్న పేరుంది. ఎన్టీఆర్ దేవర చిత్రంలోనూ ఇదే చూపించే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతుంది. మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత అవసరం లేదన్నది చూపించే ప్రయత్నం ఈ కథలో కనిపించింది. మూవీ స్టార్ట్ కావడమే సీరియస్ గా మొదలవుతుంది. 20 నిమిషాల తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాతే జోష్ పెరిగింది.

కథను కూడా మొత్తం సీరియస్ గానే తీసుకెళ్లాడు దర్శకుడు. అయితే, ఇంటర్వెల్ వరకు కాస్త నరేషన్ స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్ మాత్రం అభిమానులకు వీనులవిందే. ఫస్ట్ ఆఫ్ లో కొరటాల శివ దేవర కథ చూపగా, సెకండాఫ్ మొత్తం దేవర కొడుకుతోనే నడిపించాడు. కామెడీ సీన్లు కూడా పండించాడు. ఈ మధ్యలో యాక్షన్ సీక్వెన్సులు, అండర్ వాటర్ ఫీట్లు, విజువల్ ఎఫెక్ట్స్ అలరించాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ మొదలైన తర్వాత హీరో, హీరోయిన్ల మధ్య సీన్లు బాగానే ఉన్నాయి. చుట్టమల్లే సాంగ్ మాత్రం అభిమానుల మనసు దోచేసిందని చెప్పక తప్పదు.

కథలో క్లైమాక్స్ ఏ సినిమాకైనా ముఖ్యం. క్లైమాక్స్ బాగుంటే సినిమా అంతా బాగున్న ఫీలింగ్ కలుగుతుంది. దేవర క్లైమాక్స్ లో కొరటాల శివ తీసుకున్న కోణం ఆకర్షించింది. సెకండాఫ్ మొత్తం పిరికివాడిగా కనిపించిన వర.. అసలు ఎందుకు అలా ఉండాల్సి వచ్చిందో దర్శకుడు చివర్లో బాగా చూపించాడు. కథను పూర్తిగా కమర్షియల్ గా కాకుండా తాను అనుకున్న కోణంలో చూపించాలని కొరటాల శివ ప్రయత్నించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ కారణంతోనే కథ అక్కడక్కడా స్లో నరేషన్ ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే, అభిమానులకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చేశాడనే చెప్పాలి. కథ నడిపించిన తీరులో ఇంకాస్త వేగం ఉన్నట్లయితే దేవర రేంజ్ మరింత పెరిగిపోయి ఉండేదని చెప్పొచ్చు. క్లైమాక్స్ మాత్రం ట్విస్టు అదిరింది.

ఎవరి నటన ఎలా ఉంది..
జూనియర్ ఎన్టీఆర్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇటు దేవర.. అటు వరగా రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయి యాక్షన్ అదరహో అనిపించాడు. హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ మూవీలో తక్కువ సమయం (కేవలం 20 నిమిషాలు) ఉన్నప్పటికీ ఫర్వాలేదనిపించింది. సైఫ్ పాత్ర ఆకట్టుకుంది. దేవర భార్యగా శృతి మరాఠే కారెక్టర్ కూడా ఫర్వాలేదనిపించింది. మిగతా పాత్రల్లో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్ బాగానే కనిపించారు. గెటప్ శ్రీను ఒకట్రెండు సీన్లలో కనిపించాడు.

సాంకేతిక సిబ్బంది పనితీరు..
దేవర మూవీకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మైనస్ అయ్యిందని చెప్పక తప్పదు. పాటల కంపోజింగ్ బాగానే ఉన్నా, ఆర్ఆర్ మాత్రం దేవర రేంజ్ కు తగ్గట్టు లేదని చెప్పొచ్చు. రత్నవేలు సినిమాటోగ్రఫీ దేవరకు ప్లస్ పాయింట్. ఎడిటింగ్ బాగానే ఉంది. అయితే, నిడివి మాత్రం 3 గంటలంటే ప్రేక్షకులకు పరీక్షే. ఓ 20 నిమిషాలు తగ్గించి ఉంటే బాగుండేది. తాను నమ్ముకున్న కథను కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించేందుకు దర్శకుడు కొరటాల శివ బాగా ప్రయత్నం చేసినట్లు సినిమాలో స్పష్టంగా తెలుస్తోంది. కథ రాసుకున్న తీరు ఫర్వాలేదు కానీ, దర్శకత్వం ఇంకాస్త మెరుగుపడి ఉంటే బాగుండు అనిపిస్తుంది.

చివరగా..
దేవర.. అభిమానులకు జాతర..

రేటింగ్: 3/5

Read also: Devara: రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది
Devara Trailer: దేవర ట్రైలర్ రిలీజ్.. కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ చింపేశాడ్రోయ్!
Devara Trailer: దేవర ట్రైలర్.. సోషల్ మీడియా షేక్ అవ్వాలి.. చూసేందుకు రెడీనా?
Devara: దేవర నుంచి మరో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌తో జాన్వీ పోటీ పడిందా?
Fear song from Devara: దేవర నుంచి ఫస్ట్‌ సాంగ్ రిలీజ్.. మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ కెవ్వు కేక!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు