Fear song from Devara: యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. సంగీత ప్రేమికులను కట్టిపడేసేలా అనిరుధ్ సాంగ్ ఉందని అప్పుడే నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా తెరంగేట్రం చేస్తున్న దేవర మూవీ రికార్డులు సృష్టిస్తుందని కామెంట్లు వస్తున్నాయి.
తాజాగా ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ మాత్రం మంచి పవర్ఫుల్ గా ఉందని చెబుతున్నారు. అనిరుధ్ తనదైన శైలిలో బాణీలు సమకూర్చారు. తారక్ పాత్రపై మంచి ఎలివేషన్స్ ఇస్తూ సాహిత్యం ఉంది. అనిరుధ్ గాత్రంతో మరింత బాగుందని కామెంట్స్ వస్తున్నాయి. మెయిన్ గా సాంగ్ డిజైన్ చూసేందుకు చూపరులను కట్టిపడేస్తోందంటున్నారు. ఈ విషయంలో అనిరుధ్ తన మార్క్ చూపించాడని అభిమానులు నెట్టింట తెగ కామెంట్లు చేస్తున్నారు.
అతిలోక సుందరి దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతోంది. దేవర సాంగ్ రిలీజ్ అయిన వెంటనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేస్తున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తీస్తున్నారు. సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్‌పై చూపించిన కొన్ని విజువల్స్ సాంగ్ చివర్లో తన ప్రెజెన్స్ సూపర్‌గా ఉండేలా చేసిందని అభిమానులు చెబుతున్నారు. ఓవరాల్ గా మాత్రం ఫ్యాన్స్ కి మాంచి ట్రీట్ ఇచ్చేలా ఫస్ట్ సాంగ్ ఉందని ఫ్యాన్స్ ఫుల్‌జోష్ గా ఉన్నారు. భారీ చిత్రానికి ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మాణం చేస్తున్నాయి. ఈ అక్టోబర్ 10న దేవర మూవీ వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది.
ఇవీ చదవండి: Rashi Singh: రాశి సింగ్ హాట్ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్ పిక్స్!!
RC16: రామ్ చరణ్‌కు జంటగా జాన్వీ కపూర్.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్!!
Janhvi Kapoor Bawaal: అమెజాన్ ప్రైమ్‌లో జూలై 21న బవాల్ రిలీజ్.. జాన్వీ కపూర్‌కు హిట్ దక్కేనా?
Family Star Movie Review: ‘ఫ్యామిలీ స్టార్’తో దేవరకొండ మెప్పించాడా? సినిమా రివ్యూ..
NTR: క్లాస్ అండ్ మాస్.. దంచి కొడుతున్న ఎన్టీఆర్..!
