HomeAndhra PradeshYS Jagan with I-Pac: 151 దాటేస్తాం.. వైయస్ జగన్‌ కాన్ఫిడెన్స్ ఇదీ

YS Jagan with I-Pac: 151 దాటేస్తాం.. వైయస్ జగన్‌ కాన్ఫిడెన్స్ ఇదీ

YS Jagan with I-Pac: జూన్ 4న విడుదల కానున్న ఎన్నికల ఫలితాల్లో సంచలనం నమోదు కానుందని ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఇవాళ ఆయన ఐ ప్యాక్‌ టీమ్‌తో భేటీ అయ్యారు. ఏడాదిన్నరగా వైయస్సార్‌ సీపీ కోసం ఐప్యాక్‌ టీమ్‌ చేసిన కృషి ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయని, గతంలో వచ్చిన 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాల విజయం కంటే ఈసారి మరింత మెరుగ్గా ఫలితాలు ఉండబోతున్నాయన్నారు. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా ఫలితాలుంటాయని జోస్యం చెప్పారు సీఎం జగన్.

విజయవాడలోని ఐప్యాక్‌ ఆఫీసుకు వెళ్లిన సీఎం జగన్‌.. టీమ్‌ సభ్యులతో ఉత్సాహంగా పలకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…

“నేను ప్రామిస్ చేస్తున్నా. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయం. మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఈసారి చరిత్ర సృష్టించబోతున్నాం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుంది. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నాం. ఒకరు ఊహించిన దానికంటే మనకు ఎక్కువ సీట్లు వస్తాయి.

2019లో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలు గెలిస్తే ఈసారి 151 అసెంబ్లీ సీట్లకు పైగా గెలవబోతున్నాం. అలాగే 22కు పైగా లోక్‌సభ స్థానాలు గెలుస్తాం. తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దాం.

రానున్న రోజుల్లో కూడా వైఎస్సార్‌సీపీ, ఐప్యాక్ ప్రయాణం ఇలాగే ముందుకు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ఏడాదిన్నరగా ఐ ప్యాక్ టీం అందించిన సేవలు వెలకట్టలేనిది. అని సీఎం జగన్‌ శ్లాఘించారు. మొత్తానికి వైఎస్సార్‌సీపీ కేడర్‌లో సీఎం జగన్‌ వ్యాఖ్యలు మరింత ఉత్సాహాన్ని నింపాయి.

ప్రశాంత్ కిషోర్ కు సీఎం జగన్ కౌంటర్
ప్రశాంత్ కిషోర్ చేసిందేమీ లేదు.. చేసేదంతా టీమే అని సీఎం జగన్‌ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ మనకు వ్యతిరేకంగా మారారన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించని ఫలితాలు వస్తాయని సీఎం జగన్ జోస్యం చెప్పారు. గతంలో కూడా 151 సీట్లు వస్తాయని ఊహించలేదని,ఈసారి వచ్చే ఫలితాలతో దేశం షాక్ కాబోతోందన్నారు. గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించామన్నారు. ఐప్యాక్ సేవలను పరిపాలనలోనూ ఉపయోగించినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి: CM Jagan: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
YS Jagan in Pithapuram: పిఠాపురంలో సీఎం జగన్ మాస్‌ స్పీచ్.. ఇక్కడ చదవండి
YS Jagan in Chilakaluripeta: ఫ్యాన్‌ గుర్తుకు గుద్దితే బ్యాలెట్‌ బద్దలవ్వాలి.. చిలకలూరిపేటలో సీఎం జగన్
YS Jagan in Kaikaluru: చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి: కైకలూరులో సీఎం జగన్
YS Jagan in Mangalagiri: పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం.. మంగళగిరిలో సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు