Aditi Rao Hydari And Siddharth: ప్రముఖ హీరోయిన్ అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ (Aditi Rao Hydari And Siddharth) వివాహం చేసుకున్నారట. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట మార్చి 27, 2024న తెలంగాణలోని ఒక దేవాలయంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.
సిద్ధార్థ్, అదితి రావు హైదరీ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వనపర్తిలోని శ్రీరంగాపురంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో పెళ్లిచేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన పూజారులు వివాహ వేడుక జరిపారని తెలుస్తోంది. అయితే, ఈ జంట ఇప్పటి వరకు తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించలేదు.
సిద్ధార్థ్, అదితి రావు హైదరీ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. సిద్ధార్థ్, అదితి రావు హైదరీ 2021లో వచ్చిన చిత్రం మహాసముద్రం సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. తర్వాత వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ నిజ జీవితంలో ప్రేమగా మారింది. మొదట వారు చాటుమాటున ప్రేమాయణం నడిపారు. ఆ తర్వాత మీడియా కంట పడటంతో బహిరంగంగా కనిపించడం ప్రారంభించారు.
చండీగఢ్‌లో AR రెహమాన్ కుమార్తె రిసెప్షన్, శర్వానంద్ నిశ్చితార్థం, రాజ్‌కుమార్ రావు మరియు పాత్రలేఖల వివాహంలో వీరిద్దరూ కలిసి కనిపించారు. అనంతరం వీరిద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. అక్టోబరు 2023లో, సిద్ధార్థ్ అదితికి ఆమె పుట్టినరోజున స్పెషల్ విషెస్ చెప్పాడు. సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా అదితి ఒక స్వీట్ పోస్ట్‌ను కూడా షేర్ చేసింది.
సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీలకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. సిద్ధార్థ్ గతంలో మేఘనను 2003లో వివాహం చేసుకున్నాడు. కానీ వారి వివాహం కొనసాగలేదు. వారు 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి రావ్ హైదరీ ఇంతకు ముందు న్యాయవాది సత్యదీప్ మిశ్రాను 2002లో వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.
ఇవీ చదవండి: Bramayugam: మమ్ముట్టి మరో మూవీ మంత్రజాలం “భ్రమయుగం”.. తెలుగులో ఎప్పుడంటే…!
Rashi Singh: రాశి సింగ్ హాట్ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్ పిక్స్!!
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఫొటో గ్యాలరీ
