HomeAndhra PradeshSIBB Meeting: ఏపీలో విస్తారంగా పెట్టుబడులు.. కీలక ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్

SIBB Meeting: ఏపీలో విస్తారంగా పెట్టుబడులు.. కీలక ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్

SIBB Meeting: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశం ఇన్న జరిగింది. ఇందులో భాగంగా ఏపీలో విస్తారంగా పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమమైంది. కీలక ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులు సాకారం కానున్నాయి. తద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. (SIBB Meeting)

ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు.

* 3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌.
వైయస్సార్‌ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్‌ 850 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు.
దాదాపు రూ. 12,065 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌.
ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు.

* నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలిమండలం జలదుర్గం వద్ద రెండు విండ్‌పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌.
171.60 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు.
రూ.1287 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు.

* శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్న ఆగ్వాగ్రీన్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
రూ.4వేల కోట్లు ఖర్చు చేయనున్న కంపెనీ.
వేయి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు.

* కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద 200 మెగావాట్ల విండ్‌పవర్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్న ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌
రూ.1350 కోట్లు ఖర్చు, 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు.

* శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌పవర్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్న రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్‌ లిమిటెడ్‌.
దీనికోసం రూ.3600 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ.
600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు.

read also: YS Jagan to YSRCP Cadre: ప్రతి గడపకూ వెళ్లండి.. జగన్‌ను తెచ్చుకుందామని చెప్పండి.. జగన్‌ వస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పండి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు