HomeAndhra PradeshYS Jagan Bheemili Meeting: వైయస్ జగన్‌ విశ్వరూపం.. కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడిని కాను.. అర్జునుడిని..

YS Jagan Bheemili Meeting: వైయస్ జగన్‌ విశ్వరూపం.. కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడిని కాను.. అర్జునుడిని..

YS Jagan Bheemili Meeting: భీమిలి నియోజకవర్గం సింగివలస నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఎన్నికల శంఖారావం పూరించారు. కుట్రలు, కుంత్రాల బాణాలకు బలైపోవడానికి తాను కురుక్షేత్ర మహాసంగ్రామంలో అభిమన్యుడిని కానని, ఇక్కడ ఉన్నది అర్జునుడంటూ వైయస్సార్‌ సీపీ కేడర్‌ గూస్‌బంప్స్‌ వచ్చేలా ప్రసంగించారు. ఇన్నాళ్లూ జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నాడనే వ్యాఖ్యలు నేటితో పటాపంచలైపోయాయి. సింహం బయటకొస్తే తోడేళ్లన్నీ పరారవుతాయన్న చందంగా భీమునిపట్నం జనసంద్రాన్ని తలపించింది. (YS Jagan Bheemili Meeting)

* భీమిలిలో అటు సముద్రం.. ఇటు జనసముద్రం కనిపిస్తోంది ఈరోజు.
* ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మలోనూ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడిలోనూ, ప్రతి సోదరుడిలోనూ, ప్రతి స్నేహితుడిలోనూ ప్రతి అవ్వలోనూ, ప్రతి తాతలోనూ మీ అందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం.. సేనాధిపతులు, ఇక్కడే కనిపిస్తున్నారు.

* ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తుంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది. గజదొంగల ముఠా ఉంది. వారి వ్యూహాల్లో వారి కుట్రల్లో వారి కుతంత్రాల్లో మోసపూరిత వాగ్దానాల్లో వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది అక్కడ.
* కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. ఇక్కడ ఉన్నది అర్జునుడు.
* ఆ అర్జునుడికి తోడు.. ప్రజలు, దేవుడి దయ ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలందరూ.

* ఇంత మంది కార్యకర్తలు, అన్నదమ్ములు, ఇంత మంది తోడు కృష్ణుడి రూపేణా మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలు అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టే మీ బిడ్డ భయపడడు. మీ బిడ్డ తొణకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం.
* ఈ 56 నెలల్లో మనం పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో అమలు చేస్తున్న ఆ పథకాలు, ఆ స్కీములే మనకు బాణాలు, మనకు అస్త్రాలు.
* ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్.
* ఈ యుద్ధంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా దేవుడి దయతో ప్రతి ఇంటికీ, ప్రతి ఊరికీ, ప్రతి ప్రాంతానికీ చేసిన మంచి వల్ల చంద్రబాబతో సహా అంతా కూడా ఓడాల్సిందే.

* ఈ సమావేశం 2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్రయాత్రకుమరో పాతికేళ్లపాటు మన సంక్షేమ,అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ భీమునిపట్నంలో కొనసాగుతోంది.
* ఈ సమావేశం మన పార్టీని భుజాన మోసిన, మోస్తున్న కార్యకర్తలు, లీడర్లు, అభిమానులకు, ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం.
* ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారామనం ఇచ్చిన ప్రతి మాటా, అధికారంలోకి వచ్చిన తర్వాత త్రికరణ శుద్ధితో ప్రతి మాటనూ నెరవేరుస్తూ మేనిఫెస్టోను బైబిల్ గా, భగవద్గీతగా, ఖురాన్ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకొనేందుకే ఈ సమావేశం.
* గతంలో ఎప్పుడైనా గమనిస్తే, ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తారు. ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో వేస్తున్న సంప్రదాయాన్ని చూశాం. మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మొట్ట మొదటి సారి మార్చింది.

* మనం మార్చాం కాబట్టే, ప్రజలకు మనం దగ్గరయ్యాం కాబట్టే ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను వైయస్సార్ సీపీని ప్రజలు తమ పార్టీగా భావిస్తున్నారు కాబట్టే చంద్రబాబు లాంటి 75 ఏళ్లు వయసు మళ్లిన నాయకుడు.. ఆ చంద్రబాబు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు.. దత్తపుత్రుడితో సహా.. ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయాలి.

ఇదీ చదవండి: Muslim Voters in AP: ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలివే..
Bus Yatra: వైయస్‌ జగన్‌ బస్సు యాత్రకు సర్వం సిద్ధం.. రెండు రోజుల షెడ్యూల్‌ ఇదీ..
YS jagan Proddatur sabha: మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు.. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గకూడదు..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు