YS Jagan fire on Babu: 2014 ఎన్నికల ముందు చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, కట్టొద్దని చెప్పాడని, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశాడని సీఎం జగన్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం ఇవాళ పర్యటించారు. వైయస్సార్ ఆసరా సొమ్ము నిధులు విడుదల చేశారు. సీఎం ఏమన్నారంటే.. (YS Jagan fire on Babu)
* చంద్రబాబు మాయమాటలు నమ్మి మహిళలు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు. కనపడకుండా చేశాడు.
* మాఫీ చేస్తానని చెప్పిన మాట గాలికొదిలేశాడు.
* అక్టోబర్ 2016 నుంచి అక్కచెల్లెమ్మలకు కడుతున్న సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు.
* అప్పట్లో 14,205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు కాస్తా తడిసి మోపెడై వడ్డీలు,చక్రవడ్డీలు కట్టే పరిస్థితిలోకి పోయి 25500 కోట్లకు ఎగబాకాయి.
* చంద్రబాబు మాటతో ఏ రకంగా అక్కచెల్లెమ్మలు దెబ్బతిన్నారన్నదానికి ఇవే ఉదాహరణలు.
* ఏ గ్రేడ్, బీ గ్రేడ్ నుంచి సంఘాలు చంద్రబాబు హయాంలో 19 శాతానికి పడిపోయాయి.
* ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడుతున్నాయి.
* ఈరోజు ఏకంగా 91 శాతం అక్కచెల్లెమ్మలు ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌లో సంఘాలు ఉన్నాయి.
* ఔట్ స్టాండింగ్ కింద 18 శాతం అక్కచెల్లెమ్మల రుణాలు ఎన్‌పీఏలుగా పడిపోయే కార్యక్రమం అప్పట్లో జరిగితే.. ఈరోజు పొదుపు సంఘాల్లో రుణాల రికవరీ 99.83 శాతంతో ఎన్‌పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే కనిపిస్తున్నాయి.
* అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగిందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలే.
* ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తపన, తాపత్రయంతో అడుగులు పడిన రోజులు ఈ 56 నెలల కాలంలోనే.
* సాధికారత దిశగా అడుగులు వేసే కార్యక్రమం జరిగింది.
* ఏకంగా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వారికే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.
* ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అడుగులు పడ్డాయి.
* నామినేషన్ పనుల్లో ఇచ్చే కాంట్రాక్ట్ పనులు కూడా 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని చట్టం చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.
* దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమే.
* ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఒక మహిళా కానిస్టేబుల్ నియమితులయ్యారు.
* దిశ యాప్ తీసుకొచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లలో 1.46 కోట్ల మంది ఫోన్లలో దిశ యాప్ డౌన్‌లోడ్ అయ్యింది.
* ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు, ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా చాలు.. పోలీస్ సోదరుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి ఏమైందని అడిగే గొప్ప వ్యవస్థ పుట్టుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే.
* ఏమీ చేయని వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠా, ఆయనకు తోడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.
* రోజూ ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సి రావడమే నిజంగా కలికాలం అనిపిస్తుంది.
* ప్రతి ఇంట్లోనూ జరిగిన మంచి కనిపిస్తోంది. అయినా రోజూ అబద్ధాలు, ఎక్కువ మంది వాళ్లవైపు ఉన్నారు కాబట్టి, టీవీ చానళ్లు ఉన్నాయి కాబట్టి రోజూ అబద్దాలతో వడ్డించడం, దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే దీన్నే కలికాలం అంటారు.
read also: YS Jagan in Uravakonda: పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.25,570 కోట్లు.. ఉరవకొండలో సీఎం జగన్

[…] […]