Exit Polls: దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ఇవాళ జరిగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో పోలింగ్ జరిగింది. వీటిలో రాజస్తాన్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ గాలి వీచిందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. రాజస్తాన్‌లో మాత్రమే బీజేపీ అధికారంలోకి వచ్చే చాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ భోగట్టా. ఇక దేశ వ్యాప్తంగా అందరి చూపూ తెలంగాణపైనే ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సర్కారు తమ విజయాన్ని నిలుపుకొని హ్యాట్రిక్ నమోదు చేస్తుందా? లేక కాంగ్రెస్ పార్టీ గెలిచి పూర్వ వైభవం సాధిస్తుందా? అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ వివరాలు గమనిద్దాం. (Exit Polls)
తెలంగాణ ఎన్నికల్లో రాత్రి 7 గంటల వరకు రూ. 64.12 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అత్యధికంగా జనగాం లో 83.34 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 40.51 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ (119)
CNN
కాంగ్రెస్ – 56
బీఆర్ఎస్ – 48
బీజేపీ – 10
ఎంఐఎం – 5
న్యూస్ 18
కాంగ్రెస్ – 56
బీఆర్ఎస్ – 48
బీజేపీ – 10
ఎంఐఎం – 5
ఆరా ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్ – 58 – 67
బీఆర్ఎస్ – 41- 49
బీజేపీ – 5 – 7
ఇతరులు 7 – 9
చాణక్య స్ట్రాటజీస్
కాంగ్రెస్ – 67- 78
బీఆర్ఎస్ – 22 – 31
బీజేపీ – 6 – 9
ఎంఐఎం 5 – 7
సీప్యాక్
కాంగ్రెస్ – 65
బీఆర్ఎస్ – 41
బీజేపీ – 5
ఇతరులు – 9
పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్
కాంగ్రెస్ – 65- 68
బీఆర్ఎస్ 35- 40
బీజేపీ – 7- 10
ఇతరులు 6 – 9
ఆత్మసాక్షి
కాంగ్రెస్ – 48 – 51
బీఆర్ఎస్ – 58 – 63
బీజేపీ – 7 – 8
ఎంఐఎం, ఇతరులు 7 – 9
థర్డ్ విజన్
కాంగ్రెస్ – 34- 40
బీఆర్ఎస్ -61- 68
బీజేపీ – 3 – 5
ఎంఐఎం 5 – 7
ఇతరులు – 0 – 1
పొలిటికల్ గ్రాఫ్
కాంగ్రెస్ – 38
బీఆర్ఎస్ – 68
బీజేపీ – 05
ఎంఐఎం – 07
ఇతరులు 0- 1
———-
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ (పీపుల్స్ పల్స్)
ఛత్తీస్ గఢ్ (మొత్తం 90 సీట్లు)
బీజేపీ – 40
కాంగ్రెస్ – 47
ఇతరులు – 3
మధ్యప్రదేశ్ (మొత్తం 230 సీట్లు)
బీజేపీ – 91 – 113
కాంగ్రెస్ – 117 – 139
ఇతరులు – 0- 8
రాజస్థాన్ (మొత్తం 199 సీట్లు)
బీజేపీ – 95 – 115
కాంగ్రెస్ – 73 – 95
ఇతరులు – 8- 21
మిజోరం (మొత్తం 40 సీట్లు)
MNF – 16 – 20
ZPM – 10- 14
కాంగ్రెస్ – 2 – 3
బీజేపీ – 6 – 10
ఇతరులు – 0
————
(న్యూస్ 18)
ఛత్తీస్ గఢ్ (మొత్తం 90 సీట్లు)
బీజేపీ – 40
కాంగ్రెస్ – 47
ఇతరులు – 3
మధ్యప్రదేశ్ (మొత్తం 230 సీట్లు)
బీజేపీ – 112
కాంగ్రెస్ – 113
ఇతరులు – 5
రాజస్థాన్ (మొత్తం 199 సీట్లు)
బీజేపీ – 111
కాంగ్రెస్ – 74
ఇతరులు – 14
రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ (199 సీట్లు)
ఆత్మసాక్షి
కాంగ్రెస్ 56- 72
బీజేపీ 124 – 136
ఆర్ ఎల్పీ – ఆర్ ఎస్పీ – 0
ఇతరులు 3 – 10
CNN న్యూస్ 18
కాంగ్రెస్ 74
బీజేపీ 111
ఆర్ ఎల్పీ – ఆర్ ఎస్పీ – 0
ఇతరులు 14
జన్ కీ బాత్
కాంగ్రెస్ 62 – 85
బీజేపీ 100- 122
ఆర్ ఎల్పీ – ఆర్ ఎస్పీ – 0
ఇతరులు 14 – 15
జీ న్యూస్
కాంగ్రెస్ 90 – 100
బీజేపీ 100- 110
ఆర్ ఎల్పీ – ఆర్ ఎస్పీ – 0
ఇతరులు 05-15
ఛత్తీస్ గఢ్ (90)
పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్ 54- 64 , బీజేపీ 29- 39 , బీఎస్పీ 0- 2 , ఇతరులు – 0
ఆత్మసాక్షి గ్రూప్ : కాంగ్రెస్ 45 -48 , బీజేపీ 41 – 44 , బీఎస్పీ 0 , ఇతరులు – 0 – 3
CNN న్యూస్ 18 : కాంగ్రెస్ 47, బీజేపీ 40 , బీఎస్పీ 0 , ఇతరులు 3
ఇండియా టుడే : కాంగ్రెస్ 40-50 , బీజేపీ 36-46 , బీఎస్పీ 0, ఇతరులు – 1 – 5
ఇండియా టీవీ : కాంగ్రెస్ 46 – 56 , బీజేపీ 30 – 40 , బీఎస్పీ 0 , ఇతరులు – 3 – 5
జన్ కీ బాత్ : కాంగ్రెస్ 42 – 53 , బీజేపీ 34 – 45, బీఎస్పీ 0 , ఇతరులు – 3
జీ న్యూస్ : కాంగ్రెస్ 42 – 50 , బీజేపీ 36 – 46 , బీఎస్పీ 0 , ఇతరులు 1 -5
CSDP : కాంగ్రెస్ 44, బీజేపీ 42 , బీఎస్పీ 0 , ఇతరులు 4
2018లో ఎగ్జిట్ పోల్స్ ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పింది : కేటీఆర్
2018లోనూ టీఆర్‌ఎస్ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని, ఈసారి కూడా ఇదే జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇదే తొలిసారి కాదన్నారు. 70కి పైగా స్థానాలతో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత ఉందని అనుకోవట్లేదన్నారు. పోలింగ్ సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరుగుతోందని చెప్పారు. 80కిపైగా స్థానాలు వస్తాయని అనుకున్నాం కానీ 70 వస్తాయంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. కార్యకర్తలు అధైర్య పడొద్దన్నారు. అధికారం తమదేనని, హ్యాట్రిక్ కొడతామని స్పష్టం చేశారు. కేసీఆరే సీఎం అవుతారన్నారు. వందశాతం అధికారంలోకి వస్తున్నామన్నారు.
కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడగొడుతున్నాం: రేవంత్ రెడ్డి
“కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడగొడుతున్నాం. శ్రీకాంతాచారి త్యాగానికి ఎన్నికల తేదికి ఒక లింక్ ఉంది. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేయడం ద్వారా ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు. డిసెంబర్ 3 న శ్రీకాంతాచారి తన తుదిశ్వాసను విడిచారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని తేలిపోయింది. తెలంగాణ ప్రజలు చైతన్యవంతంగా ఓటు వేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. ఓడిపోతామని తెలిసినప్పుడల్లా కేసీఆర్ నియోజకవర్గం మారతారు. కాంగ్రెస్ పోరాట ఫలితాలే ఈ ఎగ్జిట్ పోల్స్. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు మెజార్టీ సీట్లు వస్తాయంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినవారిని కేటీఆర్ బెదిరించడం సరికాదు. సర్వేలు నిజమైతే వారికి కేటీఆర్ క్షమాపణలు చెబుతారా? ఓడినవారు బానిస కాదు.. గెలిచినవారు రాజు కాదు. పాలకపక్షం, ప్రతిపక్షం బాధ్యతగా ఉండాలి.”
ఇదీ చదవండి: Telangana Elections: తెలంగాణలో జెండా పాతే పార్టీ ఏది? రేపే పోలింగ్.. కట్టుదిట్టమైన భద్రత
