National Media Awards 2023: ఓటు హక్కు వినియోగం ఓటర్ల చైతన్యం, అవగాహన-2023 పేరిట భారత ఎన్నికల సంఘం నేషనల్ మీడియా అవార్డులను ప్రదానం చేసేందుకు వివిధ మీడియా సంస్థల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ముఖేష్ కుమార్ మీనా ప్రకటన విడుదల చేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా (టెలివిజన్), ఎలక్ట్రానిక్ మీడియా (రేడియో), ఆన్లైన్ (ఇంటర్నెట్, సోషల్) మీడియా రంగాల్లో ఓటర్లలో చైతన్యం, అవగాహన పెంపొందించేందుకు ఉత్తమ కృషి చేసిన వారికి రంగానికి ఒక అవార్డు వంతున 2012 నుంచి ఈవిధంగా అవార్డులు అందిస్తోందని తెలిపారు. (National Media Awards 2023)
2023 ఏడాదికి సంబంధించి వచ్చే ఏడాది జనవరి 25వ తేది జాతీయ ఓటరు దినోత్సవం రోజున ఈ అవార్డులను ప్రధానం చేయనుందని ఆయన తెలియజేశారు. అవార్డు కింద నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం (Citation), జ్ఞాపిక (Plaque) ప్రదానం చేస్తారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను పెద్దఎత్తున భాగస్వాములను చేసేందుకు వారిలో ఓటుహక్కు వినియోగంపై చైతన్యం కలిగించడం, ఓటరుగా నమోదు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలతో పాటు ఎన్నికలకు సంబంధించిన ఐటి అప్లికేషన్లు, యూనిక్, రిమోట్ పోలింగ్ కేంద్రాలు వంటి వాటిపై ప్రత్యేక కథనాలు ప్రచురణ, ప్రసారం చేయాలి.
ఇలా ఓటర్ల అవగాహనకు విశేష కృషి చేసిన మీడియా సంస్థలకు భారత ఎన్నికల సంఘం ఈఅవార్డులను ప్రదానం చేయనుంది. ప్రత్యేక జ్యూరీ ఆధ్వర్యంలో క్వాలిటీ ఆప్ ఓటరు అవేర్నెస్ క్యాంపెయిన్, ఎన్నికలకు సంబంధించిన కచ్ఛితమైన, సమతుల (balanced) సమాచారాన్నిఓటర్లకు అందించడం, స్పెషల్ షోలు, చర్చలు, నిపుణులతో కూడిన చర్చలు నిర్వహణ, ఎక్స్టంట్ ఆఫ్ కవరేజ్, క్వాంటిటీని ఈజ్యూరీ అంచనా వేస్తుంది.
ఓటరు అవగాహన కార్యక్రమాలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల నిర్వహణకు తీసుకున్నచొరవ వంటి అంశాలపై ప్రచురితమైన, ప్రసారం చేసిన కధనాలను పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే ఎన్నికలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని హైలెట్ చేసి ప్రచురణ, ప్రసారం చేసిన అంశాల ఆధారాలను జ్యూరీ పరిశీలించి ఉత్తమ ఎంట్రీలను అవార్డులకు ఎంపిక చేస్తారు.
ఎంట్రీలకు సంబంధించి ప్రింట్ మీడియా న్యూస్ ఐటమ్స్, ఆర్టికల్స్ ప్రచురితమైన కాలం సెంటీమీటర్లు వివరాలను సాప్ట్ కాఫీ పిడిఎఫ్ లేదా న్యూస్ పేపర్, ఆర్టికల్స్ పుల్ సైజ్ పొటోకాఫీ, ప్రింట్ కాఫీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. డైరెక్ట్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన మరే ఇతర సమాచారాన్నైనా పంపవచ్చు.
బ్రాడ్ కాస్ట్ టెలివిజన్ (ఎలక్ట్రానిక్), రేడియో (ఎలక్ట్రానిక్) ఎంట్రీలకు సంబంధించి క్యాంపెయిన్, వర్కు సంక్షిప్త సమాచారం సీడీ లేదా డీవీడీ లేదా పెన్ డ్రైవ్ ద్వారా బ్రాడ్ కాస్ట్, టెలికాస్ట్ అయిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రసారమైన అన్నిస్పాట్లు,న్యూస్ వివరాలను, ఓటరు అవగాహనకు సంబంధించిన న్యూస్ ఫీచర్లు లేదా ప్రోగ్రామ్ లకు సంబంధించిన సీడీ లేదా డీవీడీ లేక పెన్ డ్రైవ్ రూపంలో టెలికాస్ట్, బ్రాడ్ కాస్ట్ అయిన వ్యవధి, తేదీ, సమయం, ప్రీక్వెన్సీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ (ఇంటర్నెట్, సోషల్) మీడియా ఎంట్రీలు పంపేవారు విధిగా ఓటరు అవగాహనకు సంబంధించిన ఆనిర్దేశిత సమయంలో చేసిన పోస్టులు, బ్లాగ్స్, క్యాంపెయిన్లు, ట్వీట్లు, ఆర్టికల్స్ వంటి వాటి వివరాలను పీడీఎఫ్ సాప్ట్ కాఫీ లేదా సంబంధిత వెబ్ లింక్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. పబ్లిక్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఇతర కార్యక్రమాలు, ఇంపాక్ట్ ఆఫ్ ఆన్లైన్ యాక్టివిటీ వివరాలను ఆయా ఎంట్రీలతో కలిపి సమర్పించాలి.
ఓటర్ల చైతన్యం, అవగాహనపై నేషనల్ మీడియా అవార్డ్సు-2023కు ఎంట్రీలు పంపే వారు ఆంగ్లం, హిందీ మినహా మిగతా భాషలకు సంబంధించినవి ఆంగ్లం ట్రాన్సులేషన్ తో కలిపి పంపాల్సి ఉంటుంది. ఉత్తమ ఎంట్రీల ఎంపికలో ఎన్నికల కమీషన్ దే తుది నిర్ణయమని ఎంట్రీ దారులతో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలను చేయబోదు. ఎంట్రీకి సంబంధించి విధిగా మీడియా హౌస్ పేరు, అడ్రస్, టెలిఫోన్ నంబరు, ఫ్యాక్స్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్ కలిగి ఉండాలి. ఎంట్రీలను వచ్చే డిసెంబర్ 10వ తేదీ లోగా పంపాలి.
ఎంట్రీలు పంపాల్సిన చిరునామా:
రాజేశ్ కుమార్ సింగ్, అండర్ సెక్రటరీ (కమ్యునికేషన్),
ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్,
అశోకా రోడ్డు, న్యూఢిల్లీ 110001.
ఈమెయిల్: media-division@eci.gov.in.
ఫోన్ నంబరు:011-23052131.
Read Also : Hathiram Math: హథీరాం మఠం మహంతు అర్జున్ దాస్ తొలగింపు.. ఏపీ దేవాదాయ శాఖ కీలక నిర్ణయాలు
