Dust Allergy: నగరాలు, పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ దుమ్ము, ధూళి ఉండటం సహజమే. రోడ్లపైన, ఇంటి పరిసర ప్రాంతాల్లోనూ దుమ్ము వచ్చి పడుతూ ఉంటుంది. అయితే, డస్ట్ అలర్జీ ఉన్న వారికి ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. డస్ట్ అలర్జీ ఉన్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే, ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు వాడటం వల్ల డస్ట్ అలర్జీ నుంచి ఉపశమనం పొందుతారని చెబుతున్నారు. (Dust Allergy)
డస్ట్ అలర్జీ ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది?
సాధారణంగా దుమ్ము, ధూళి వల్ల ఎక్కువ మందికి డస్ట్ అలర్జీ అనిపిస్తుంది. ఇంకొందరికి అగరబత్తీల వాసన వస్తే అలర్జీ అన్నట్లు ఉంటుంది. కొన్ని రకాల పెర్‌ఫ్యూమ్‌లు, సెంట్లు వాసన వల్ల కూడా డస్ట్ అలర్జీ వచ్చే ఆస్కారం ఉంటుంది. బయటకు వెళ్లినప్పుడు పొల్యూషన్ కారణంగా కూడా అలర్జీ వస్తుంది.
ఇలాంటి కారణాల వల్ల ఊపిరితిత్తుల్లో సూక్ష్మక్రిములు చేరుతాయి. డస్ట్ అలర్జీ రకాల్లో సాధారణంగా ఉన్న వాళ్లయితే చవన్‌ప్రాశ్ లేహ్యం తీసుకుంటారు. వ్యాధి ముదిరే పరిస్థితికి వచ్చినప్పుడు మహాలక్ష్మీ విలాస్ రసం అని బయట మార్కెట్‌లో దొరుకుతుంది. దీన్ని వాడటం వల్ల సమస్య వేగంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
తలనొప్పికి ఆయుర్వేద మందు
అలాగే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న వారికి కూడా ఆయుర్వేదంలో కొన్ని రకాల మందులు వాడితే వెంటనే ఉపశమనం పొందుతారు. చంద్రావతి రసం అనే ఆయుర్వేద మందు వాడటం వల్ల శిరస్సుకు సంబంధించిన సమస్యలేవైనా తగ్గిపోతాయి. దాంతోపాటు చందనాది తైలం తలకు రాసుకోవడం వల్ల మైగ్రేన్, తలనొప్పి, తలనిమ్ము, నిద్రలేని తనం లాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అశ్వగంధ లేహ్యం తింటూ ఉంటూ ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Asthma Treatment: ఆస్తమాకు ఆయుర్వేదంలో చికిత్స.. ఉపశమనం లభిస్తుందిలా..!
Curd: పెరుగు తింటే ఆరోగ్యం దెబ్బతింటుందా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
