Dharma Raju: మహాభారతం అందరికీ తెలిసే ఉంటుంది. చారిత్రక ఇతిహాసంలో ధర్మరాజుది ప్రధాన భూమిక. పాండురాజు సంతానమైన ఐదుగురిలో ధర్మరాజు అగ్రజుడు. యమధర్మరాజు అంశతో కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు. భారతం మొత్తానికి ధర్మరాజు ప్రత్యేకంగా నిలుస్తాడనడంలో ఆశ్చర్యం లేదు. ఇక భారతంలో పాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. (Dharma Raju)
ఉత్తమ గురువులైన కృపాచార్యుడు, ద్రోణాచార్యులు వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవులు, పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై, తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందుతాడు. ఈ యోగ్యతను గమనించిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును రారాజుగా పదవిలో నియమిస్తాడు. తన తండ్రి పాండురాజును స్వర్గానికి పంపాలనే సదుద్దేశంతో ధర్మరాజు రాజసూయ యాగాన్ని తలపెడతాడు. దిగ్విజయంగా నిర్వహించి పూర్తిచేస్తాడు.
ఈ క్రమంలో శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇచ్చి ధర్మరాజు పూజిస్తాడు. తర్వాత మయసభను తిలకించడానికి వచ్చిన దుర్యోధనుడు అవమానం పొందుతాడు. ద్రౌపది దరహాసాన్ని భరించేలని దుర్యోధనుడు దురాలోచన చేస్తాడు. ఇక్కడే అసలు భారతం మొదలవుతుంది. మాయా జూదానికి తెరతీస్తారు. శకుని చేతిలో ధర్మరాజు తన సర్వస్వాన్నీ కోల్పోతాడు. సోదరులను, రాజ్యాన్ని, చివరకు ద్రౌపదిని కూడా జూదంలో ఒడ్డి మోసపోతాడు.
సర్వమూ ఎరిగిన శ్రీకృష్ణుడు.. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అంశ కలిగిన వాడని, పాండవులకు అండగా నిలిచాడనే వాస్తవం కౌరవులకు సైతం తెలిసిందే. అయితే, యమధర్మ రాజు అంశతో జన్మించిన ధర్మరాజు ఇలా మాయాజూదం వలలో పడటం అనేది శ్రీకృష్ణ లీలగానే భావించవచ్చు. భారత యుద్ధానికి ఈ అంకం నాంది పలికిందనే సత్యం మరువరాదు.
తనను తాను ఒడ్డుకున్నా, రాజ్యాన్ని, అన్నదమ్ములను ఒడ్డినా, ఆఖరికి అర్జునుడు తన ప్రతిభతో సొతం చేసుకున్న ద్రౌపదిని కూడా ఒడ్డేందుకు ధర్మరాజుకు హక్కు ఏర్పడింది. ఇదంతా ధర్మంపై నిలబడ్డాడని చెప్పేందుకే జరిగిందని భావించవచ్చు. అధర్మం, యామా పద్ధతులు అసలే అవలంభించలేదు ధర్మరాజు. యుద్ధంలోనూ కుటిల నీతిని ప్రదర్శించలేదు. అందుకే ధర్మరాజు చరిత్రలో అగ్రజుడిగా కీర్తి పొందాడు.
యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతి హాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు. పాండు రాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారని అందరం చదువుకున్నాం. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై, తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందాడనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఈ యోగ్యతను గమనించిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజు పదవిలో నియమించాడని మహాభారతంలో చెప్పారు.
విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ధృతరాష్ట్రుడు తన తమ్ముని భాగమైన అర్థరాజ్యాన్ని పాండవులకు పంచి ఇచ్చాడు. ఆ రాజ్యానికి మొదట ఖాండవ ప్రస్థం ముఖ్య పట్టణంగా ఉండేది. శ్రీకృష్ణుని కోరిక మేరకు ఇంద్రుడు పంపిన విశ్వకర్మ ఇంద్రప్రస్థం అనే నూతన రాజధానిని ధర్మరాజుకు నిర్మించి ఇచ్చాడని మహాభారతంలో చెప్పారు.
Read Also : Toli Ekadashi: అన్ని పండుగలకు ఆది తొలి ఏకాదశి.. విశిష్టతలు ఇవీ..
