గురువారం, 22 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Life Style

Tulsi : తులసిని సరైన దిశలో ఉంచితే.. అదృష్టం మీ ఇంటికే

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 12 సెప్టెంబర్ 2025

Tulsi : హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కను పవిత్రమైనదిగా పరిగణిస్తారు. శ్రీమహాలక్ష్మీదేవి నివాసం ఈ మొక్కలోనే ఉంటుందని, శ్రీమహావిష్ణువు తులసి ప్రియుడని నమ్మకం ఉంది. అందుకే తులసి దళాలను ప్రతిరోజూ విష్ణుమూర్తికి సమర్పిస్తే ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. Tulsi

వాస్తు శాస్త్రం ప్రకారం
తులసి మొక్కను తూర్పు దిశలో నాటితే ఇంట్లో శుభఫలితాలు వస్తాయి.
తూర్పు దిశలో స్థలం లేకుంటే ఉత్తరం లేదా ఈశాన్యం దిశల్లోనూ ఉంచవచ్చు.
ఈ దిశల్లో తులసి నాటితే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పూజలో తులసి వాడకం
తులసి కోటలో పెంచిన మొక్క నుంచి పూజ కోసం ఆకులు తీయకూడదు. దాంతో దరిద్రం వస్తుందని నమ్మకం ఉంది. అందుకే పూజ కోసం ప్రత్యేకంగా వేరే కుండలో తులసి మొక్క పెంచి, దానినుంచే ఆకులు సేకరించాలి.

తులసి పూజ విధానం
తులసిని నిత్యం పూజించాలి.
సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతారని విశ్వాసం ఉంది.
మంగళవారం, శుక్రవారం రోజుల్లో తులసి దళాలు కోయకూడదు.

జాగ్రత్తలు
తులసి మొక్కను దక్షిణ దిశలో ఎప్పుడూ నాటకూడదు.
ఆ దిశను పితృదేవతల దిశగా పరిగణిస్తారు కాబట్టి అక్కడ తులసి ఉంచితే ఆర్థిక నష్టం, కుటుంబ కలహాలు వచ్చే అవకాశముందని నమ్మకం.

ఆరోగ్య ప్రయోజనాలు
తులసి వనం ఏర్పడితే ఆ గాలి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తలనొప్పి, గొంతునొప్పి, జలుబు వంటి సమస్యల సమయంలో తులసి ఆకులు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం లభిస్తుంది.

తులసి మొక్కను సరైన దిశలో ఉంచితే అది శుభఫలితాలు, ఆరోగ్య ప్రయోజనాలు రెండింటినీ అందిస్తుంది.

ఇవీ చదవండి: Tulasi Tea : వర్షాకాలంలో జలుబు, గొంతు సమస్యలకు ఇంటి చిట్కా.. తులసి, అల్లం, తేనెతో హెల్త్ డ్రింక్
Tulasi Chettu: ఔషధ గుణాల తులసిచెట్టు.. తులసి ఆకులు, మొక్కతో ఎలాంటి ఉపయోగాలున్నాయంటే..

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading