శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Tollywood : ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్.. కట్ చేస్తే అవకాశాలే కట్! కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ కథ ఇదే

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 16 డిసెంబర్ 2025

Tollywood : టాలీవుడ్‌లో మెరిసిన మెరుపుతీగల జాబితా పెద్దదే. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన హీరోయిన్లు ఎంతోమంది. కొన్ని సినిమాలతోనే ప్రేక్షకుల మనసు దోచుకున్నా, ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయి ఇండస్ట్రీకి దూరమైన భామలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హీరోయిన్ కూడా అదే కోవకు చెందినది.

తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి, కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా జరగలేదు. రెండు మూడు మంచి సినిమాలు చేసినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో మెల్లగా వెండితెరకు దూరమైంది. కొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెబితే, మరికొందరు సరైన ఆఫర్లు లేక కనుమరుగవుతుంటారు. ఈ భామ కూడా అలాంటి జాబితాలో చేరిపోయింది.

తొలి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరోయిన్ మరెవరో కాదు… ఒకప్పుడు ‘జూనియర్ ఐశ్వర్య రాయ్’గా భారీ క్రేజ్ తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్. 2007లో విడుదలైన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. డెబ్యూ మూవీతోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఆమె నీలి కళ్లు, ఐశ్వర్య రాయ్‌ను తలపించే లుక్స్ అప్పట్లో యువతను బాగా ఆకట్టుకున్నాయి.

ఆ తర్వాత యంగ్ హీరో సుశాంత్‌తో కలిసి నటించిన ‘కరెంట్’ సినిమాతో మరోసారి యూత్ ఆడియన్స్‌కు దగ్గరైంది. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన ‘సింహా’ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ సినిమాల తర్వాత స్నేహ ఉల్లాల్ కెరీర్ ఊహించని మలుపు తిరిగింది.

తర్వాత ‘వరుడు’, ‘అలా మొదలైంది’ వంటి సినిమాల్లో కేవలం క్యామియో పాత్రలకే పరిమితమైంది. చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్‌తో కలిసి నటించిన ‘మడత కాజా’ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం ‘యాక్షన్ 3డీ’, ‘అంతా నీ మాయలోనే’ వంటి సినిమాలు చేసినా అవి ప్లాఫ్‌లుగానే మిగిలిపోయాయి.

తెలుగుతో పాటు కన్నడ, హిందీ ఇండస్ట్రీల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నా స్టార్ హీరోయిన్ స్థాయికి మాత్రం చేరలేకపోయింది. చివరిసారిగా 2022లో విడుదలైన హిందీ సినిమా **‘లవ్యూ లోక్ తంత్ర’**లో నటించింది. ప్రస్తుతం సినిమాలకంటే సోషల్ మీడియాపైనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ కొట్టి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా మారిన స్నేహ ఉల్లాల్… కాలం మారడంతో కెరీర్ గ్రాఫ్ క్రమంగా తగ్గిపోయింది. అయినప్పటికీ ఆమె అందం, క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదనే చెప్పాలి.

View this post on Instagram

ఇవీ చదవండి: Yashashree : ట్రెండింగ్‌లో తెలుగు గర్ల్.. ముద్దుగుమ్మ ఫొటోలు వైరల్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అమ్మడు!
Ruhani Sharma : 8 సినిమాల్లో 2 హిట్లు… కానీ అందంలో అజంతా శిల్పం! టాలీవుడ్‌లో ముద్దుగుమ్మ పయనం
Sreeleela: మూడేళ్లుగా ఇండస్ట్రీలో దుమ్ములేపిన భామ.. ఇప్పుడేమైంది?

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading