గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Business

Ola Electric: ఓలా ఓన‌ర్‌కు క‌ష్టాలు.. సంచ‌ల‌నంగా మారిన కేసు.. నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 18 ఫిబ్రవరి 2026

Ola Electric: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఎదిగిన Ola Electric కు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఓలా స్కూటర్లకు సంబంధించిన అగ్ని ప్రమాదాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఇప్పుడు కంపెనీ సీఈఓ Bhavish Aggarwal పై మరో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో గోవాలోని జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

వినియోగదారుల కమిషన్ ఉత్తర్వులు
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 23 ఉదయం 10:30 గంటలకు భవిష్ అగర్వాల్‌ను కమిషన్ ముందు హాజరుపరచాలని బెంగళూరు పోలీసులను ఆదేశించింది. ఆయన రూ.1.47 లక్షల బాండ్‌తో పాటు అదే మొత్తంలో పూచీకత్తు సమర్పిస్తే బెయిల్‌పై విడుదల కావచ్చని కూడా కమిషన్ స్పష్టం చేసింది.

ఈ ఉత్తర్వులు గోవాలోని మార్గావ్ జిల్లా వినియోగదారుల కమిషన్ జారీ చేసింది. ప్రీతిష్ చంద్రకాంత్ ఘాడి అనే వినియోగదారు ఓలా ఎలక్ట్రిక్‌పై చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఈ చర్యలు తీసుకున్నారు.

కేసు నేపథ్యం
ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, తాను కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బైక్‌ను మరమ్మతుల కోసం ఓలాకు అప్పగించానని, కానీ ఆ వాహనం ప్రస్తుతం కనిపించడం లేదని ఆరోపించారు. బైక్‌కు సంబంధించిన పూర్తి మొత్తాన్ని ఇప్పటికే చెల్లించినప్పటికీ, కంపెనీ నుంచి సరైన స్పందన రాలేదని పేర్కొన్నారు.

ముందుగా నోటీసు… గైర్హాజరు
ఈ కేసులో భవిష్ అగర్వాల్‌ను ఫిబ్రవరి 4, 2026న ఉదయం 10:30 గంటలకు కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని జనవరి 28న నోటీసు జారీ చేశారు. అయితే నిర్ణయించిన రోజున ఆయన హాజరు కాకపోవడంతో కమిషన్ కఠినంగా వ్యవహరిస్తూ ఇప్పుడు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఇక ముందేం జరుగుతుంది?
కమిషన్ ఆదేశాల ప్రకారం, ఫిబ్రవరి 23న అగర్వాల్ కమిషన్ ముందు హాజరవుతారా? లేక పోలీసుల ద్వారా అరెస్టు చేసి తీసుకురావాల్సి వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఓలా ఎలక్ట్రిక్ లేదా భవిష్ అగర్వాల్ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.

మొత్తానికి, ఓలా ఎలక్ట్రిక్ ఎదుర్కొంటున్న సవాళ్ల జాబితాలో ఇది మరో కీలక అంశంగా మారిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇవీ చ‌ద‌వండి: Telangana Scholarships 2025: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ – రూ.161 కోట్లు విడుదలకు ఆమోదం
Electric Scooter : రూ.41,999కే లైసెన్స్ లేకుండానే దొరికే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ – రేంజ్, ఫీచర్లు, ధర పూర్తి వివరాలు!

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading