కర్ణాటకలోని ఓ ఆలయం (Karnataka Temple) సంవత్సరమంతా మూసేస్తారు.. దీపావళి సందర్భంగా ఆ మూడు రోజులే తెరుస్తారు… సాధారణంగా ప్రముఖ దేవాలయాలన్నీ సూర్య గ్రహణం, లేదా చంద్ర గ్రహణం రోజుల్లో మూసి వేస్తూ ఉంటారు. శ్రీకాళహస్తి మహాశివుని ఆలయం లాంటిదైతే అది కూడా ఉండదు. ప్రత్యేక సేవల సందర్భంగా కూడా భక్తులకు అనుమతి ఉండదు కానీ దేవాలయాలు మూత పడవు. అయితే, కరోనా నేపథ్యంలో మనదేశంలో చాలా ఆలయాలు మూత పడ్డాయి. ఇది ప్రత్యేక సందర్భం. కానీ, ఏడాదిలో మూడు రోజులు మాత్రమే తెరుచుకొనే ఆలయం ((Karnataka Temple) ఒకటుంది. అదే కర్ణాటకలోని ధార్వాడ్ తబకడహొన్నలిలో ఉన్న (Karnataka Temple) ఆలయం.
విద్యుత్ దీపాల్లాంటివి అస్సలు కనిపించవు. వాటికి బదులుగా ఇక్కడ దశాబ్దాల కాలం నుంచి వస్తున్న దీపాలను వెలిగిస్తారు. అనంతరం హోలాలమ్మ దర్శనం చేసుకుంటారు. చాలా ప్రాంతాల నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకొనేందుకు భక్తులు తరలి వస్తుంటారు. అయితే, ఈ ఆలయానికి సంబంధించి అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
దీపావళి పర్వదినం నేపథ్యంలో ఏడాదిలో మూడు రోజులు మాత్రమే భక్తుల సౌకర్యార్థం తెరిచి ఉంచుతారు. ఇక సంవత్సరంలో మిగతా అన్ని రోజులూ మూతబడే ఉంటుంది. కర్ణాటకలోని ఈ ఆలయంలో హోలాలమ్మ దేవి కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఏడాదిలో తెరుచుకొనే మూడు రోజుల కోసం గుడిలో ప్రత్యేకంగా ఏమీ అలంకరణలు చేయరు.
కోరిన కోర్కెలు నెరవేర్చే తల్లిగా హోలాలమ్మను కొలుస్తారు. సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. హోలాలమ్మ దేవతను సంతానోత్పత్తి దేవత అని పిలుస్తారట. ఇక్కడకు వచ్చి అమ్మవారికి మొక్కకున్న తర్వాత కోరిన కోరిక తీరిన వారు దేవాలయం తెరిచి ఉండే మూడు రోజుల్లో తప్పనిసరిగా పూజలు నిర్వహించాలట. ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది. దీనిపై ఎలాంటి నిర్ధారిత చరిత్ర అయితే లేదని గ్రామస్తులు చెబుతున్నారు.
పర్సులో ఆ వస్తువు పెట్టుకుంటే.. ఒక్కరోజులో ధనవంతులవుతారట..
తెలుగు వారికి కార్తీక మాసం చాలా ముఖ్యమైనది. సంప్రదాయబద్ధంగా అనేక నియమాలు ఈ మాసంలో పాటిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా అనేక పద్ధతులు పాటించే వారు ఉన్నారు. ప్రత్యేకించి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే కార్తీకమాసం సరైన సమయంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దాని కోసం అనేక ఉపాయాలు ఉన్నాయి.
కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజులుగా చెబుతారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే కార్తీక శుక్రవారం చాలా మంచిది. ఇలాంటి కార్తీక శుక్రవారం నాడు చేయాల్సిన పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతోందనుకొనే వారు కార్తీక శుక్రవారం రోజున కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఆ సమస్యల నుంచి బయట పడొచ్చు. ముఖ్యంగా పర్సులో ఓ వస్తువు ఉంచుకోవాలట.
పగలూ, రాత్రి శ్రమించినా కలిసి రావడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. ఇలాంటి వారి కోసం జ్యోతిష్య శాస్త్రంలో అనేక నివారణ ఉపాయాలు సూచిస్తున్నారు నిపుణులు. కార్తీక మాసం అంటే శివునికి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రం. ఈ నెలలో చేసే ప్రతి పనీ చాలా అద్భుతంగా ఉండాలని, అన్నీ కలిసి రావాలని చాలా మంది కోరుకుంటారు.
బంగారం లేదా వెండి నాణేన్ని మీ పర్సులో ఉంచుకుంటే ఇక మీకు తిరుగుండదట. అపారమైన సంపద మీ సొంతమవుతుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఈ మాసంలో వచ్చే శుక్రవారం రోజు బంగారం, లేదా వెండి నాణేన్ని పర్సులో ఉంచుకోండి. ఇలా చేయడానికి ముందు లక్ష్మీదేవిని పూజించండి. ఆమె పాదాలకు వీటిని సమర్పించి తర్వాత మాత అనుగ్రహం పొందేలా కోరుకోండి. ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలు తీరిపోతాయి. పేదలకు సాయం చేస్తూ, వారికి ఆహారం పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
Read Also : Climate Crisis: వంద కోట్ల మంది సామూహిక వలసలు..!