శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Malaika Arora: డేటింగ్ రూమర్స్‌పై మలైకా స్పందన.. ‘నా జీవితానికి పురుషుడు అవసరం లేదు’

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 28 మార్చి 2026

Malaika Arora: బాలీవుడ్‌లో తన స్టైల్, ఫిట్‌నెస్, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి Malaika Arora మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై తాజాగా ఆమె స్పందించారు.

ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‌తో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన మలైకా ప్రస్తుతం 50 ఏళ్ల వయసులోనూ అదే ఫిట్‌నెస్, గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆమె సినిమాల్లో మళ్లీ కనిపిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

రూమర్స్‌పై అసహనం
ఇటీవల మలైకా ఒక డైమండ్ వ్యాపారితో డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై స్పందించిన మలైకా మొదట్లో ఇలాంటి రూమర్స్ తనకు చిరాకు తెప్పించేవని, కానీ ఇప్పుడు వాటిని చూసి తాను, తన కుమారుడు కలిసి నవ్వుకుంటామని చెప్పారు.

ఎవరితో కనిపించినా డేటింగ్ అంటూ వార్తలు
మలైకా మాట్లాడుతూ… ఎవరితోనైనా బయట కనిపిస్తే వెంటనే వారితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు రాయడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు.

గతంలో ఆమె బాలీవుడ్ హీరో Arjun Kapoor తో రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

స్వయంకృషితో ఎదిగిన మహిళ
చిన్నప్పటి నుంచి తాను ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంకృషితో ఎదిగిన మహిళనని మలైకా చెప్పారు. తన ఉనికిని చాటుకోవడానికి లేదా జీవితంలో పూర్తి స్థాయి సంతోషం కోసం పురుషుడు అవసరం లేదని అన్నారు.

భవిష్యత్తుపై మలైకా వ్యాఖ్యలు
భవిష్యత్తులో ఎవరితోనైనా జీవించాలనిపిస్తే అది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం అవుతుందని, దాని గురించి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

మలైకా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

ఇవీ చ‌ద‌వండి: Malaika Arora: మలైకా అరోరా కొత్త ప్రేమ కథ.. తనకంటే 19 ఏళ్లు చిన్న యువకుడితో రిలేషన్‌షిప్?
Malaika Arora: మళ్లీ ప్రేమలో మలైకా అరోరా? బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన కొత్త రిలేషన్ వార్తలు
Malaika Arora: ఫ్లాట్ బెల్లీ – స్ట్రాంగ్ బాడీ రహస్యం: మలైకా అరోరా చెప్పిన సింపుల్ కెట్టిల్‌బెల్ ఫార్ములా

ట్యాగ్స్: , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading