ఎసిడిటీ సమస్య (Acidity Relief Yoga) ప్రస్తుతం చాలా మందిని వేధిస్తోంది. ఆహారంలో మార్పులు చేసుకోకపోవడం వల్ల ఎసిడిటీ సమస్య వెంటాడుతుంది. దాంతో పాటు వేళకు తిండి తినకపోయినా కూడా ఎసిడిటీ ఎటాక్ చేసేస్తుంది. ఎసిడిటీని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నివారించుకోవాలి. లేదంటే మరింత సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. యువత, పెద్దవారిలో ఈ సమస్య ఇప్పుడు సాధారణమైంది. ఆహారంలో మార్పుల ద్వారా ఎసిడిటీని తగ్గించుకోవచ్చు. అయితే చక్కటి యోగాసనాల ద్వారా ఎసిడిటీని (Acidity Relief Yoga) తగ్గించుకొనే వీలుంది.
మరోవైపు ఉస్త్రాసనం కూడా ఎసిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆసయం వేయడం కోసం కాళ్లను వెనుకకు చాచి నేలపై ఉంచాలి. అరికాళ్లు పైకప్పునకు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. మీ చేతులను తుంటిపై ఉంచేలా జాగ్రత్త పడాలి. లోతైన శ్వాస తీసుకోవడం ముఖ్యం. వంపు చేయడానికి వెనుకకు వంగాలి. సపోర్ట్ కోసం అరచేతులను పాదాలపై పెట్టుకోండి. తల వెనుకకు వంచాలి. చేతులు, మెడ నిలువుగా ఉండేటట్లు చూసుకోవాలి. 10 సెకన్ల వరకు ఇలాంటి భంగిమలో ఉండొచ్చు.
యోగాలో అనేక ఆసనాలున్నాయి. వీటిని ఫాలో కావడం వల్ల నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఇందులో ఎసిడిటీని తగ్గించుకోవడానికి వేయాల్సిన మొదటి ఆసనం వజ్రాసనం. నేలపై మోకాళ్లతో మీ మడిమలపై కూర్చోవాలి. తల, వెన్నెముక నిలువుగా ఉంచాలి. చేతులను మోకాళ్లపై లేదా తొడలపై ఉంచాలి. దాదాపు 30 సెకెన్లపాటు ఇలా పట్టుకోవాలి. సుమారు 10 నిమిషాల వరకు ఇలా కూర్చుండిపోవచ్చు. శ్వాసను దీర్ఘంగా పీల్చుకొని వదులుతూ ఉండాలి.
లోటస్ భంగిమలో వెన్నెముక నిలువుగా ఉంచి ఈ యోగాసనాన్ని ప్రయత్నించొచ్చు. సౌకర్యవంతంగా కూర్చోవాలి. అరచేతులను మోకాళ్లపై తలకిందులుగా ఉంచుకోవాలి. ఊపిరి తీసుకుంటున్నప్పుడు నాభి, బొడ్డును వెన్నెముకవైపు లాగేలా చూసుకోవాలి. కళ్లు మూసుకుని ఈ భంగిమను పది సార్లు రిపీట్ చేసుకోవచ్చు. దీంతో పాటు పవనముక్తాసనం కూడా ట్రై చేస్తే ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది.
Guava: జామ పండుతో కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..
జామపండు తింటే చెప్పలేనన్ని ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. జామపండ్లు ఏ సీజన్‌లో అయినా లభిస్తుంటాయి. జామ ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాలానుగుణంగా దొరికే పండ్లు తినాలని డాక్టర్లు సూచిస్తూనే ఉంటారు. వాటిని మిస్ అయితే ఒంట్లో ప్రొటీన్లు లభించవని చెబుతారు. ప్రతి సీజన్ లో మార్కెట్ లో జామ పండు లభ్యమవుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. జామ పండు తినడం ద్వారా నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. చిన్న పిల్లలు, పెద్దలు కూడా ఈ పండు తినడానికి ఇష్టపడుతుంటారు.
జామ ఆకులతో చాలా విధాలుగా మేలు జరుగుతుంది. జామ ఆకులతో టీ తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి నీటిలో కలుపుకొని తాగుతారు. జామ ఆకులతో తయారు చేసుకున్న టీ సేవించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. షుగర్ లెవల్స్ తగ్గుముఖం పడతాయి. ఈ ప్రభావం సుమారు రెండు గంటల పాటు పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
టైప్ 2 డయాబెటిస్ కూడా జామ ఆకులతో చేసిన టీ సేవించడం వల్ల వ్యాధి నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. చక్కెర స్థాయి 10 శాతానికి పైగా తగ్గిందని రుజువైందంటూ అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమయంలో జామ ఆకులు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు. జామ ఆకులు ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల మహిళలకు ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు. పెయిన్ కిల్లర్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Read Also : TRP Rating: టీఆర్పీ రేటింగ్‌లో దుమ్మురేపిన సినిమాలు ఇవే..