గురువారం, 24 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Imtiaz Ali Daughter Engagement: స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ కుమార్తె ఇదా అలీకి నిశ్చితార్థం 

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 23 సెప్టెంబర్ 2026

Imtiaz Ali Daughter Engagement: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ ఇంట్లో శుభకార్యం జరిగింది. ‘లవ్ ఆజ్ కల్’, ‘రాక్‌స్టార్’, ‘హైవే’, ‘మై వాపస్ ఆవుంగా’ వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన కుమార్తె ఇదా అలీ నిశ్చితార్థం జరిగింది. ముంబైలో మంగళవారం జరిగిన ఈ ప్రైవేట్ వేడుకకు సంబంధించిన ఫొటోను ఇంతియాజ్ అలీ సోషల్ మీడియాలో పంచుకుని కొత్త జంటకు ఆశీస్సులు అందించాలని కోరారు.

ముంబైలో నిశ్చితార్థం

ఇదా అలీ, కృష్ణ్ అగర్వాల్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. జూలైలో నార్వే పర్యటన సందర్భంగా కృష్ణ్.. ఇదాకు పెళ్లి ప్రపోజ్ చేశారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇంతియాజ్ అలీ షేర్ చేసిన ఫొటోలో ఇదా, కృష్ణ్ ఉంగరాలు మార్చుకుంటూ కనిపించారు.  ఇదా పింక్ కలర్ చీరలో కనిపించగా.. కృష్ణ్ బ్లాక్ షేర్వాణీలో సందడి చేశారు. సాధారణంగా కుటుంబ వేడుకలకు దూరంగా ఉండే ఇంతియాజ్ అలీ.. ఈ ప్రత్యేక సందర్భానికి సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నార్వేలో రొమాంటిక్ ప్రపోజల్

ఇదా, కృష్ణ్ ప్రేమకథలో నార్వే ప్రపోజల్ ప్రత్యేకంగా నిలిచింది. జూలై 1న రాత్రి 11 గంటల సమయంలో నార్వేలోని య్‌ట్రెసాండ్ ప్రాంతంలో కృష్ణ్ మోకాళ్లపై కూర్చుని ఇదాకు పెళ్లి ప్రపోజ్ చేశారు. అనంతరం ఆమెకు డైమండ్ రింగ్ తొడిగారు. ఈ అందమైన క్షణాలను ఇదా స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అప్పట్లో వైరల్‌గా మారాయి. ప్రపోజల్ సమయంలో కృష్ణ్ ముందుగా ఇంతియాజ్ అలీతో మాట్లాడి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారని కూడా ఇంతియాజ్ అలీ వెల్లడించారు.

కృష్ణ్ అగర్వాల్ ఎవరు?

ఇదా కాబోయే భర్త కృష్ణ్ అగర్వాల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన హెడ్జ్ ఫండ్ సంస్థలో క్వాంటిటేటివ్ రీసెర్చర్‌గా పనిచేస్తున్నట్లు ఇదా గతంలో వెల్లడించారు. ప్రయాణాలు చేయడం ఇద్దరికీ ఇష్టమని కూడా ఆమె చెప్పింది. కృష్ణ్ తనకంటూ ఓ ప్రొడక్షన్ కంపెనీని కూడా ప్రారంభించినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. Hindustan Times ఇదా, కృష్ణ్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారని సమాచారం. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా బహిరంగంగా పంచుకోకుండా.. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు.

తండ్రి బాటలో ఇదా

ఇంతియాజ్ అలీ కుమార్తెగా మాత్రమే కాకుండా ఇదా అలీ తనకంటూ సినీ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి మాదిరిగానే ఆమె కూడా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు స్వతంత్రంగా కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘మాయా’, ‘లిఫ్ట్’, ‘థాయ్ మసాజ్’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌కు ఆమె దర్శకత్వం వహించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన దర్శకత్వ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. తండ్రి పేరు లేదా పరిచయాలను ఉపయోగించుకుని అవకాశాలు పొందడం కంటే, తన సొంత కథలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు ఇదా చెప్పారు. ఇటీవల తన స్నేహితురాలు కరీమా బారీతో కలిసి ఓ షార్ట్ ఫిల్మ్‌ను కూడా రూపొందించారు.

పెళ్లి ఎప్పుడు?

నిశ్చితార్థం జరిగినప్పటికీ.. ఇదా, కృష్ణ్ పెళ్లి తేదీని మాత్రం ప్రకటించలేదు. జూలైలో నిశ్చితార్థం తర్వాత ఇదా మాట్లాడుతూ.. అప్పటికి పెళ్లి ప్రణాళికలు లేవని, ప్రస్తుతం ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పింది. తాజాగా ముంబైలో నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా తేదీ వెల్లడించలేదు. ఇక ఇంతియాజ్ అలీకి కూడా కుమార్తె నిశ్చితార్థం ప్రత్యేకమైన ఆనందాన్ని ఇచ్చింది. కృష్ణ్ తనను సంప్రదించి ఆశీర్వాదం తీసుకున్న విషయాన్ని ఆయన గతంలో వెల్లడించారు. ఇప్పుడు నిశ్చితార్థ వేడుక ఫొటోను స్వయంగా పంచుకుని కొత్త జంటకు ఆశీస్సులు కోరడం ద్వారా కుటుంబంలో ఈ వేడుకకు ఉన్న ప్రాధాన్యతను అభిమానులతో పంచుకున్నారు.

Read also: Malayalam Heroines: మలయాళ ముద్దుగుమ్మల హవా మళ్లీ మొదలైందా? సౌత్‌లో ట్రెండ్ అవుతున్న కేరళ కుట్టీస్
Tollywood Heroine: వర్షంలో తడిసి ముద్దైన ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తక్కువ సినిమాలే చేసినా.. నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ
Tollywood Heroines: ఇమేజ్ మార్చుకుంటున్న హీరోయిన్లు.. ప్రయోగాలు చేస్తున్నా సక్సెస్ ఎందుకు దక్కడం లేదు?

ట్యాగ్స్: , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading