గురువారం, 22 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
International

H-1B VISA: హెచ్-1బీ వీసాలపై కొత్త నియమాలు..? విదేశీ ఉద్యోగులకు పెరుగుతున్న సవాళ్లు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 29 మార్చి 2026

H-1B VISA: అమెరికాలో పనిచేయాలనే లక్ష్యంతో ఉన్న లక్షలాది మంది భారతీయులకు హెచ్-1బీ వీసా ఒక పెద్ద అవకాశం. అయితే ఇటీవల ఈ వీసా విధానంపై అమెరికాలో మళ్లీ చర్చలు వేడెక్కుతున్నాయి. స్థానిక ఉద్యోగుల కంటే విదేశీ ఉద్యోగులకు తక్కువ వేతనం చెల్లిస్తున్నారని ఆరోపణలు రావడంతో అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా విధానంలో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. ముఖ్యంగా వేతనాల పెంపు, నియామక విధానాల కట్టుదిట్టం వంటి అంశాలపై కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

వేతనాల పెంపుపై అమెరికా ఆలోచన
అమెరికా కార్మిక శాఖ తాజా ప్రతిపాదనల ప్రకారం హెచ్-1బీ వీసాదారుల కనీస వేతనాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం స్థానిక ఉద్యోగులతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు సగటున 10,191 డాలర్లు తక్కువ వేతనం లభిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, కంప్యూటర్ రంగాల్లో ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హెచ్-1బీ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం సుమారు 14,000 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నాలుగు స్థాయిల వేతన వ్యవస్థలో మార్పులు
కార్మిక శాఖ ప్రతిపాదించిన కొత్త విధానంలో నాలుగు స్థాయిల వేతన వ్యవస్థలో కీలక మార్పులు ఉండనున్నాయి.
ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు – వేతనం 34% వరకు పెంపు
లెవల్-2 ఉద్యోగాలు – 52% వరకు పెంపు
లెవల్-3 ఉద్యోగాలు – 70% వరకు పెంపు
లెవల్-4 ఉద్యోగాలు – 88% వరకు పెంపు
ఈ మార్పులు అమల్లోకి వస్తే విదేశీ ఉద్యోగులను నియమించే కంపెనీలకు భారీగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం కంపెనీలు ఏటా సుమారు 6.56 బిలియన్ డాలర్లు అదనంగా వేతనాలుగా చెల్లించాల్సి రావచ్చు.

ఎందుకు ఈ మార్పులు?
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను అసలు ఉద్దేశ్యం ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను అమెరికాకు తీసుకురావడం. కానీ కొంతకాలంగా కొన్ని కంపెనీలు తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.

2024 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన హెచ్-1బీ వీసాల్లో 63 శాతం ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకే వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో అమెరికాలోని ఉద్యోగ సంఘాలు, కొన్ని రాజకీయ వర్గాలు ఈ విధానాన్ని పునర్విమర్శించాలని కోరుతున్నాయి.

భారతీయులకు ఏమవుతుంది?
హెచ్-1బీ వీసాల్లో ఎక్కువ శాతం భారతీయ ఐటీ నిపుణులకే లభిస్తాయి. కొత్త నియమాలు అమల్లోకి వస్తే కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకునే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. దీంతో హెచ్-1బీ వీసా పొందడం కొంత కఠినంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో హెచ్-1బీ ఉద్యోగులకు అధిక వేతనం పొందే అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి ఆమోదం తర్వాత మాత్రమే కొత్త నిబంధనలు అధికారికంగా అమల్లోకి వచ్చే అవకాశముంది.

ఇవీ చ‌ద‌వండి: Visa : వీసా అవసరమే లేదు! ఇండియన్లు ఎంట్రీ ఫ్రీగా వెళ్లగల దేశాలు ఇవే
Visakha Economic Region : ఎనిమిది జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’
Pax Silica Alliance: భారత్ – అమెరికా నేతృత్వంలోని పాక్స్ సిలికా కూటమిలో చేరింది.. గ్లోబ్ హ‌బ్‌గా కీల‌క అడుగు

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading