గురువారం, 22 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Business

Gold Price today: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం ధ‌ర‌ల్లో మార్పులు.. ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 3 మార్చి 2026

Gold Price today: ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా వరుసగా మూడు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలు మంగళవారం కొంత తగ్గుముఖం పట్టాయి. యుద్ధ భయాలతో పసిడి ధరలు రూ.2 లక్షల దిశగా దూసుకెళ్తాయన్న ప్రచారం జరిగినా, ప్రస్తుతం మార్కెట్ కాస్త చల్లబడినట్లు కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్న వేళ ధరలు స్వల్పంగా తగ్గడం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,500 వద్ద కొనసాగుతోంది. ఇదే ధర నిన్న రూ.1,70,510గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం రూ.1,56,290 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా 24 క్యారెట్ల బంగారం రూ.1,70,500గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,56,290గా ఉంది.

ఇతర ప్రధాన నగరాల్లో రేట్లు
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,830గా నమోదైంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,56,590 వద్ద ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.1,70,500 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,56,290గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,70,650గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,56,440గా ఉంది.

వెండి ధరలు కూడా స్వల్ప మార్పులు
ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3,15,100గా ఉంది. సోమవారం ఇది రూ.3,15,000గా నమోదైంది.
హైదరాబాద్‌లో కిలో వెండి రూ.3,14,900గా కొనసాగుతోంది.
చెన్నైలో కూడా కిలో వెండి ధర రూ.3,14,900గా ఉంది.
బెంగళూరులో కిలో వెండి రూ.3,15,100గా కొనసాగుతోంది.

మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే మార్కెట్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నందున కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చ‌ద‌వండి: Gold Loan New Rules: గోల్డ్ లోన్ తీసుకునే ముందు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
Gold from sim cards: చెత్తలో బంగారం..! సిమ్‌కార్డుల నుంచే రూ.27 లక్షల విలువైన గోల్డ్ తీసిన యువకుడు

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading