Priyadarshi: బలగం మూవీతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు ప్రియదర్శి (Priyadarshi). అంతకుముందు పెళ్లి చూపులు, జాతి రత్నాలు, అర్జున్ రెడ్డి లాంటి మూవీలు, తాజాగా వెబ్ సిరీస్‌లు.. ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు.. ఇలా బిజీగా సాగిపోతోంది నటుడు ప్రియదర్శి (Priyadarshi) కెరీర్. తొలుత పెళ్లి చూపులు మూవీతో మొదలైన అతని ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. తొలి మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రియదర్శి. తనదైన నటన, కామెడీ టైమింగ్‌తో మెప్పించిన ప్రియదర్శి.. నా చావు నేను సస్తా.. నీకెందుకు.. అనే డైలాగ్‌తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు.
మరో కమెడియన్ రాహుల్ రామకృష్ణతో కలిసి ఓ టాక్ షోలో మాట్లాడాడు ప్రియదర్శి. ఈ సందర్భంగా అతడు వ్యక్తిగత విషయాలను, సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇండస్ట్రీలో తనకు నచ్చనిది, నచ్చలేదని చెప్పడం చాలా కష్టమని, నో చెప్పడం కూడా ఓ కళ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పటి వరకు తాను తనకు తగిన పాత్రలే చేస్తూ వచ్చానని చెప్పాడు ప్రియదర్శి. తనకు నచ్చకపోతే సున్నితంగానే నో చెప్పేస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే, ఇక్కడ నో చెప్పడం పెద్ద కళనే అంటూ ప్రియదర్శి కామెంట్ చేశాడు. ఇలా చెప్పడం వల్ల చాలా మంది తలపొగరు అనుకుంటారని తెలిపాడు. ఇతనో పెద్ద ఆర్టిస్ట్.. ఇతనికి నచ్చాలట.. అంటూ ఇంకా ఏవేవో అనుకుంటారని చెప్పాడు. అందువల్ల ఇక్కడ నోరు దగ్గర పెట్టుకోని మాట్లాడాలని, లేదంటే మన ప్రమేయం లేకుండానే చాలా జరిపోతాయంటూ ప్రియదర్శి వ్యాఖ్యానించాడు.
పెళ్లి చూపులు మూవీలో చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. థియేటర్లలో ప్రేక్షకులు ప్రియదర్శి డైలాగులకు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఒక్క డైలాగ్‌తో ప్రియదర్శి రాత్రి రాత్రే స్టార్ డమ్‌ని సొంతం చేసుకున్నాడు. తర్వాత ది ఘాజి ఎటాక్, అర్జున్ రెడ్డి, జై లవకుశ, జాతి రత్నాలు, రాధే శ్యామ్, సీతారామం, ఒకే ఒక జీవితం లాంటి సినిమాల్లో నటించి తన నటనను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం కమెడియన్‌గా, నటుడి వరుస ఆఫర్లు కైవసం చేసుకుంటూ బిజీ లైఫ్ కొనసాగిస్తున్నాడు.
ప్రియదర్శి హైదరాబాద్‌లో జన్మించాడు. తండ్రి పులికొండ సుబ్బాచారి ప్రొఫెసర్. ఈయన కవితలు, పద్యాలు రాస్తుండేవాడు. తల్లి జయలక్ష్మి గృహిణి. ప్రియదర్శి హైదరాబాద్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్ లో పి.జి. పూర్తి చేశాడు. ప్రియదర్శికి చిన్నతనం నుంచి సినిమాల మీద అమితమైన ఆసక్తి ఉండేది. అందుకే ప్రస్తుతం సినిమాల్లో అంతగా రాణిస్తున్నాడు. ప్రియదర్శి చెల్లెలు నావికాదళంలో లెఫ్టినెంట్ కమాండర్‌గా ఉన్నారు. ప్రియదర్శి భార్య రిచా నవలా రచయిత్రిగా రాణిస్తున్నారు. ఆమె స్వస్థలం ఆగ్రా సమీపంలో బృందావనం.
ప్రియదర్శి 2016లో టెర్రర్ అనే మూవీలో టెర్రరిస్టుగా నటనతో మెప్పించాడు. అదే ఏడాదిలో వచ్చిన పెళ్లిచూపులు సినిమాలో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడు కౌశిక్ పాత్రలో నటించి అందరి దృష్టిలో పడ్డాడు. తెలంగాణ యాసలో ప్రియదర్శి పలికిన సంభాషణలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. మధ్యలో కొన్ని లఘు చిత్రాలలో కూడా కనిపిస్తున్నాడు. జూనియర్ ఎన్. టి. ఆర్ కథానాయకుడుగా వచ్చిన జై లవకుశ, మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన స్పైడర్ సినిమాలోనూ నటించి మెప్పించాడు.
Read Also : Nithya Menon: పెళ్లి గురించి నిత్యా మీనన్ అభిప్రాయం ఏంటంటే..