Krithi Shetty: ఉప్పెన మూవీతో కుర్రకారులో గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి (Krithi Shetty). తన అందమైన చిరునవ్వుతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస మూవీల్లో చాన్సులు కొట్టేసి దూసుకుపోతోంది. సినిమాలతో పాటు పలు పాపులర్ బ్రాండ్ల ప్రకటనలు చేస్తూ రాణిస్తోంది. ఉప్పెన మూవీ సమయంలోనే బాగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
సాధారణంగానే టాలీవుడ్‌లో ఓ మూవీ హిట్ అయ్యిందంటే వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే కెరీర్‌లో దూసుకుపోయే చాన్స్ ఉంటుంది. అయితే, ఇక్కడ మరో మతలబు కూడా ఉంది. వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవడంతోపాటు కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేయరాదు. అలా చేయడం వల్ల ప్లాపులు మూటగట్టుకొని ఇండస్ట్రీకి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇలా జరిగిన సంఘటనలు టాలీవుడ్‌లో కోకొల్లలుగా ఉన్నాయి.
మరోవైపు ఉప్పెన మూవీ హిట్ కావడంతో కృతికి (Krithi Shetty) సినిమాల్లో చాన్స్‌లు పెరిగాయి. పలు ప్రాజెక్టులకు ఓకే కూడా చేసింది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. చైల్డ్ ఆర్టిస్టుగా నటించి తర్వాత హీరోయిన్‌గా మారింది ఈ సొట్టబుగ్గల సొగసరి కృతి శెట్టి. తర్వాత ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుంది బేబమ్మ.
తాజాగా కృతి శెట్టి మరో యంగ్ హీరో సరసన నటించే అవకాశాన్ని పట్టేసింది. మరో యంగ్ హీరోతో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్. ఒకే ఒక జీవితంతో మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్.. ఇటీవల మరో సినిమా చేయడానికి సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా కృతిశెట్టిని ఎంపిక చేసినట్లు టాక్. ఈ ప్రాజెక్టు విషయమై ఇప్పటికే కృతితో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. ఇందుకు కృతి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే చాన్స్ ఉందట.
ఈ భామ శర్వానంద్‌తో జోడీ కట్టబోతోందని తెలుస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ మూవీని చేస్తున్నారట. ఇందులో కథానాయికగా కృతిశెట్టిని ఖరారు చేశారని తెలిసింది. శర్వానంద్‌తో ఈ భామకిది తొలి చిత్రం కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని, త్వరలో కృతిశెట్టి షూటింగ్‌లో పాల్గొనబోతున్నదని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
ఇక దర్శకుడు వెంకట్ ప్రభు చేతికి కొత్తగా విజయ్ సినిమా వచ్చిందట. సంగీత బాధ్యతలు యువన్ శంకర్ రాజా తీసుకున్నారు. ఇద్దరు కథానాయికలకు చోటుండే ఈ సినిమాలో ఒక కథానాయికగా కృతి శెట్టిని తీసుకుందామనేలా డెసిషన్ తీసుకున్నారట. వరస ఫ్లాపులతో ఉన్న కృతికి అర్జెంట్ గా సూపర్ హిట్ సినిమా కావాల్సి ఉంది. విజయ్ లాంటి స్టార్ హీరో చిత్రంలో చేస్తేనే అది సాధ్యమవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని ఇండస్ట్రీలో టాక్. విజయ్ పక్కన అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది బేబమ్మ. కస్టడీ సినిమా సమయంలో ఆమె ఫెర్మార్మెన్స్ నచ్చిన వెంకట్ ప్రభు.. బేబమ్మను రికమెండ్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
Read Also : Priyadarshi: నో చెప్పడం ఒక కళ.. అందరికీ రాదు.. జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి