IND vs PAK: 2026 పురుషుల అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా ప్రకటించింది. జింబాబ్వే మరియు నమీబియాలలో జరగనున్న ఈ టోర్నమెంట్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు సాగనుంది. మొత్తం 23 రోజుల పాటు 16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడ్డాయి. మొత్తం 41 మ్యాచ్‌లు జరగనున్నాయి.
అయితే, ఈసారి అందరికీ నిరాశ కలిగించే నిర్ణయం తీసుకుంది ఐసీసీ — గ్రూప్ దశలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్ ఉండదని స్పష్టం చేసింది. గత కొన్ని గ్లోబల్ టోర్నమెంట్‌లలో భారత్–పాక్ మ్యాచ్ తప్పనిసరిగా ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించిన ఐసీసీ, ఈసారి మాత్రం రెండు జట్లను వేర్వేరు గ్రూపుల్లో ఉంచింది.
భారత్–పాక్ వేర్వేరు గ్రూపులు: అభిమానులకు షాక్
గత రెండు U-19 వరల్డ్ కప్‌ల్లోనూ ఇదే తరహా పరిస్థితి. ఆ రెండు టోర్నీల్లోనూ గ్రూప్ దశలో భారత్–పాక్ పోటీ జరగలేదు. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగింది. అయితే సూపర్-6, సెమీఫైనల్ లేదా ఫైనల్‌లో — ఇరుజట్ల మధ్య పోరు జరగే అవకాశం మాత్రం ఉంది.
U-19 వరల్డ్ కప్ 2026 – గ్రూపులు
గ్రూప్ A – భారత్ ఉన్న గ్రూప్
భారత్
న్యూజిలాండ్
బంగ్లాదేశ్
యునైటెడ్ స్టేట్స్ (USA)
గ్రూప్ B – పాకిస్తాన్ ఉన్న గ్రూప్
పాకిస్తాన్
జింబాబ్వే (ఆతిథ్య జట్టు)
ఇంగ్లాండ్
స్కాట్లాండ్
గ్రూప్ C
ఆస్ట్రేలియా (డిఫెండింగ్ ఛాంపియన్)
ఐర్లాండ్
జపాన్
శ్రీలంక
గ్రూప్ D
టాంజానియా
వెస్టిండీస్
ఆఫ్ఘనిస్తాన్
దక్షిణాఫ్రికా
టీమిండియా మ్యాచ్ షెడ్యూల్
జనవరి 15: భారత్ vs అమెరికా – బులవాయో
జనవరి 17: భారత్ vs బంగ్లాదేశ్ – బులవాయో
జనవరి 24: భారత్ vs న్యూజిలాండ్ – బులవాయో
టోర్నమెంట్ వివరాలు
ప్రారంభం: జనవరి 15, 2026
ఫైనల్: ఫిబ్రవరి 6, 2026
హోస్ట్స్: జింబాబ్వే & నమీబియా
ఇవీ చదవండి: IND vs PAK : టీమ్ ఇండియా చారిత్రాత్మక ఘనవిజయం.. తేలిపోయిన పాక్
Asia Cup 2025: ఒమన్‌పై భారత్ హ్యాట్రిక్ విజయం.. ఆదివారం పాక్‌తో పోరు






