వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో (Bedroom Vastu) కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. కొన్ని కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా మనల్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంటాయి. ఫలితంగా జీవితం తలకిందులు అయిపోతుంది. అలాంటి వాటిలో పడక గది టిప్స్ పాటిస్తే మంచి ఫలితాలు చూడొచ్చు. నివాస స్థలం, జీవించే ప్రాంతం మన ఆనందాలకు కారణం అయ్యేలా చూసుకోవాలి. పడక గది (Bedroom Vastu) విషయంలో కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఇంట్లో మనశ్శాంతి చేకూరుతుందంటున్నారు నిపుణులు.
1. ఇంట్లో అత్యంత ప్రశాంతమైన వాతావరణం ఉండేది పడక గదిలోనే. అలాంటి పడక గదిని వాస్తు శాస్త్రం ప్రకారం ఉంచుకుంటే మంచిది.
2. కాస్త శ్రద్ధ పెట్టి బెడ్ రూమ్ ను వాస్తు ప్రకారం డిజైన్ చేసుకోవాలి. దీని వల్ల కొన్ని సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
3. వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రించడానికి దక్షిణ దిశ ఉత్తమంగా ఉంటుంది. పడుకొనేటప్పుడు తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉండేలా పడుకుంటే మంచిది.
4. బెడ్ రూమ్ లో ప్లేస్ మెంట్ కూడా చాలా ముఖ్యమైనది. మంచం చెక్కతో చేసినదైతే బెటర్. ఇనుముతో చేసిన మంచం వాడితే ప్రతికూలతలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు.
5. మెటల్ మంచం కూడా మంచిది కాదు. గదిలో మంచం ఓ మూలకు నెట్టేయరాదు. బెడ్ గోడ మధ్య భాగంలో ఉండేలా చూసుకోవాలి. మంచం చుట్టూ తిరగడానికి తగినంత స్థలం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
6. మంచం చతురస్త్రాకారంలో ఉండేలా చూసుకోవాలి. గుండ్రంగా లేదా, ఇతర ఆకారాల్లో ఉండే మంచాలు వాడరాదు. డబుల్ కాటన్ మంచం ఉంటే ఒకే పరుపు ఉండేలా చూసుకోవాలి.
7. దంపతుల మధ్య సఖ్యత చేకూరలంటే ఒకే మంచంపై పడుకోవాలి. భర్తకు భార్య ఎడమవైపే పడుకోవాలి. తద్వారా శాంతి, సంపదలు చేకూరుతాయి.
8. ఒంటరిగా ఉన్న జంతువులు, పక్షులకు సంబంధించిన చిత్రాలు, వస్తువులు బెడ్ రూమ్ లో ఉంచరాదు. జంటలే ఉండేలా చూడాలి. జింక, హంస, చిలుకల ఫొటోలు పెట్టుకోవచ్చు.
ఇంట్లో ఎప్పుడూ గొడవలా.. మార్పులు చేసి చూడండి
1. ఇంట్లో మనశ్శాంతి ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఒక్కరికీ తమ ఇంటి గురించి అందమైన కలలు ఉంటాయి. సుఖం, శాంతి, సంతోషం ఉండాలని చాలా మంది కోరుకుంటారు.
2. అయితే, కొందరు దంపతులు ఇంట్లో నిత్యం గొడవలు పడుతూ ఉంటారు. తరచూ ఏదో ఒక అంశంపై కొట్లాడుతుంటారు. తద్వారా ఆ ఇంట్లో శాంతి కరువవుతుంది.
3. గొడవలు భార్యా భర్తల మధ్య పెను చిచ్చు రేపుతాయి. వ్యక్తుల మధ్య తప్పులు సరిదిద్దుకొనే అలవాటు లేకపోవడం వల్లనే ఎక్కువ శాతం గొడవలు జరుగుతూ ఉంటాయి.
4. ఇందుకు కారణం వాస్తు దోషాలు కూడా అయ్యుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటే ఆ గృహంలో సంతోషాలు పరిమళిస్తాయి.
5. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే పూజలు చేయడం ముఖ్యం. నిత్య పూజలు, హోమం చేస్తే మంచి ఫలితాలు వెంటనే వస్తాయి. ఇంట్లో వాతావరణం స్వచ్ఛంగా మారి చెడు సంకేతాలు, నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
6. ఉదయం, సాయం సంధ్యా సమయాల్లో భగవంతుడిని పూజించి నిత్యం దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వీలైనంత వరకు పూజ కూర్చొనే చేసేలా చూసుకోవాలి.
7. ఇంటి బయట తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి. మన హిందూ సంస్కృతిలో తులసిని దేవతగా పూజిస్తారు. ఇంటికి తూర్పు దిక్కున ఏర్పాటు చేసుకుంటే మంచిది.
8. రోజూ ఉదయం, సాయంత్ర వేళల్లో తులిసికి దీపం వెలిగించి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి.
9. అలాగే ఇంటి తలుపులు, ప్రవేశ ద్వారాలు రెండేసి ఉంటే వెనుక భాగం నుంచి రాకపోకలు ఆపేయాలి. ముందు భాగం నుంచే రాకపోకలు సాగించాలి.
10. పౌర్ణమి రోజును శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లు అనుమానం ఉంటే పౌర్ణమి రోజున ఇంట్లో గంగా జలంతో శుద్ధి చేసుకోవాలి.
11. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించాలంటే మరో ఉపాయం ఉంది.
12. ఉప్పును నీటిలో వేసి ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియాలు తొలగిపోవడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ మన సొంతం అవుతుంది.
Read Also : Vastu Tips: గృహంలో వాస్తు దోషాలున్నాయా? డబ్బుకు ఇబ్బందులా.. ఇలా చేస్తే దశ తిరిగిపోతుంది!