Bitcoin Cryptocurrency: మళ్లీ పుంజుకున్న బిట్‌ కాయిన్‌.. ఏకంగా రూ.30 వేలు జంప్!

Bitcoin Cryptocurrency: బిట్‌ కాయిన్‌ను నమ్ముకున్న వాళ్లు సర్వం పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పరిస్థితుల నుంచి బిట్‌ కాయిన్‌ కోలుకుంటోంది. గడచిన సోమవారం క్రిప్టో లాభాల్లోకి వెళ్లింది. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేశారు. సోమవారం బిట్‌ కాయిన్‌ 1.13 శాతం పెరిగింది. దీంతో రూ.21.45 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ కాస్ట్‌ రూ.41.62 లక్షల కోట్లుగా నమోదైంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) సోమవారం గత 24 గంటల్లోనే 0.31 శాతం పెరిగింది. రూ.1,44,580 వద్ద ట్రేడ్‌ అయ్యింది. మార్కెట్‌ విలువ రూ.17.38 లక్షల కోట్లుగా నమోదైంది. (Bitcoin Cryptocurrency)

ఇక ఇందులోనే టెథెర్‌ 0.03 శాతం పుంజుకుంది. రూ.82.46 వద్ద కొనసాగింది. అలాగే, బైనాన్స్‌ కాయిన్‌ 0.12 శాతం తగ్గి రూ.19,397, రిపుల్‌ 2.72 శాతం పెరిగి రూ.43.04, యూఎస్‌డీ కాయిన్‌ 0.02 శాతం తగ్గి రూ.82.41, లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.35 శాతం పెరిగి రూ.144,494 డోజీ కాయిన్ 0.01 శాతం తగ్గి రూ.5.07 వద్ద కొనసాగాయి. ఫ్లెక్స్‌ కాయిన్‌, టోమో చైన్‌, సైబర్ హార్పర్‌, సుయి, డీసెంట్రలాండ్‌, కర్డానో లాభపడ్డాయి. శార్డస్‌, సేఫ్‌మూన్‌, రాకెట్‌ పూల్‌, థార్‌చైన్‌, బేబీ డోజీ, జీఎంఎస్‌, స్విస్‌ బోర్గ్‌ నష్టాలను చవి చూడక తప్పలేదు. (BitCoin)

క్రిప్టో కరెన్సీ.. చాలా కాలం కిందట వరకు కొందరిని లక్షాధికారులను చేసింది. దీని ద్వారా ఇన్వెస్ట్‌ మెంట్‌ చేసిన వారి పంట పండింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై ట్యాక్స్‌ కూడా వేసింది. కనిపించని కరెన్సీపై ట్యాక్యులేంటంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అయితే, కరోనా సమయంలో క్రిప్టో కరెన్సీ అంతరించే పరిస్థితికి వెళ్లింది. ఇన్వెస్టర్లు బిచ్చగాళ్లయ్యారు. పెట్టిన పెట్టుబడి అంతా జీరోకు చేరిపోయింది.

ఇక క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. ఎక్కువ మంది వీటిపై ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడింగ్‌ చేయడం మొదలు పెడుతున్నారు. అయితే, రోజూ వీటి ధరలు హెచ్చుతగ్గులు నమోదు చేస్తుంటాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే ఛేంజ్‌ అయిపోతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్‌ అసెట్‌గా చెబుతారు. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతిస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను సేవ్‌ చేస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా ఇలాంటివి తయారు చేస్తుంటారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా ఎవరికీ కనబడదు. అంతా డిజిటల్‌ రూపేణా ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి, వీటికీ ఏమాత్రం సంబంధం ఉండదు.

అయితే, ఇండియాలో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత కల్పించలేదు. కానీ, ట్రేడింగ్‌ చేసుకొనేందుకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం ఉండదు. పెట్టుబడిదారులే ఇందుకు పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ కుప్పలు తెప్పలుగా మనకు ఆండ్రాయిడ్‌ యాప్స్‌ రూపంలో అందుబాటులోకి వచ్చేశాయి.

Read Also: Gold Rates Today (13-06-2023): మార్పులు లేని పసిడి.. నేటి బంగారం, వెండి ధరలు ఇవీ..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles