సోమవారం, 14 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Grama Ward Sachivalayam: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 25 మే 2023

Grama Ward Sachivalayam: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మానస పుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాల (Grama Ward Sachivalayam) ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. జూన్‌ 10వ తేదీ దాకా సచివాలయ ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్లకు అవకాశం కల్పించారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న, ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయిన ఉద్యోగులకు బదిలీ అయ్యేందుకు చాన్స్‌ ఉంటుంది.

ఆయా జిల్లాల పరిధిలో, అంతర్‌ జిల్లాల బదిలీలకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. బదిలీల్లో పారదర్శకత ఉండేలా ఎక్కడా పైరవీలకు తావు లేకుండా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియను ప్రారంభించి వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ కల్పిస్తూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2020 నోటిఫికేషన్‌లో ఎంపికైన వారికి ప్రొబేషన్‌ను ప్రభుత్వం కల్పించింది. శాఖాపరమైన పరీక్షలో పాస్‌ కావడంతో పాటు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్‌ వస్తుందని జీవోలో పేర్కొన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలను రెండో విడత నోటిఫికేషన్‌ ద్వారా పొందిన వారికి కూడా ప్రొబేషన్‌ ఖాయం చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ 17వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మే 1వ తేదీ నుంచి వారికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తున్నాయి. 2020లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారు.. మొన్నటి దాకా రూ.15 వేల జీతం అందుకున్నారు. ఇక ప్రొబేషన్‌ ఖరారు తర్వాత వీరు దాదాపు రెట్టింపు వేతనాలు అందుకుంటున్నారు.

గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ప్రొబేషన్‌ ఖరారైన గ్రేడ్‌ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్టేటివ్‌ సెక్రటరీలు ప్రస్తుతం కనీస బేసిక్‌ వేతనం రూ.23,120గా ఉంది. ఇక డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకున్న తర్వాత రూ.29,598 అందుకుంటున్నారు. మిగిలిన 17 విభాగాల వారు కనీస బేసిక్‌ వేతనం రూ.22,460 అయితే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకుంటే రూ. 28,753 అందుకుంటున్నారు.

పట్టణ ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌ ప్రకారం కొంత మందికి కొంచెం ఎక్కువ వేతనం అందుతోంది. పెరిగిన వేతనాలు మే 1 నుంచి అమలులోకి వస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అప్పట్లో పేర్కొంది. ప్రొబేషన్‌ ఖరారు ఉత్తర్వుల విడుదల నేపథ్యంలో జిల్లాల్లో వేర్వేరుగా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను ముఖ్యమంత్రి జగన్‌ సృష్టించారు. జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) విధానంలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో మరో 9,600 ఎనర్జీ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 2019 జూలైలో నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శులకు రూ.22,120 – రూ.74,770పే స్కేలును అమలు చేస్తోంది ప్రభుత్వం.

Read Also : Machilipatnam: రాక్షసుల తరహాలో అడ్డుకుంటున్నారు.. బందరులో సీఎం జగన్‌

AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading