Manasaagadhe Toxic: రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి రెండో సింగిల్ ‘మనసాగదే’ (Manasaagadhe) విడుదలైంది. ఇప్పటికే ‘తబాహీ’ పాటతో భారీ హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు ఈ మెలోడీ సాంగ్‌తో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంటున్నారు. తెలుగు వెర్షన్‌లో విడుదలైన ఈ పాటలో యష్, తారా సుతారియా మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.
