Jobs in SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచీల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (Circle Based Officers – CBO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,273 పోస్టులను భర్తీ చేయనున్నట్లు SBI ప్రకటించింది.
అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 29, 2026 నుంచి ఫిబ్రవరి 18, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో స్థిర ఉద్యోగం కోరుకునే యువతకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
సర్కిళ్ల వారిగా ఖాళీల వివరాలు
హైదరాబాద్ సర్కిల్ – 80 పోస్టులు
అమరావతి సర్కిల్ – 101 పోస్టులు
భోపాల్ – 118 పోస్టులు
భువనేశ్వర్ – 85 పోస్టులు
చండీగఢ్ – 108 పోస్టులు
చెన్నై – 208 పోస్టులు
గాంధీనగర్ – 249 పోస్టులు
గువాహటి – 85 పోస్టులు
బెంగళూరు – 236 పోస్టులు
జైపూర్ – 113 పోస్టులు
కోల్‌కతా – 242 పోస్టులు
లక్నో – 221 పోస్టులు
మహారాష్ట్ర – 204 పోస్టులు
ముంబయి మెట్రో – 152 పోస్టులు
న్యూఢిల్లీ – 83 పోస్టులు
తిరువనంతపురం – 83 పోస్టులు
అర్హతలు
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అలాగే అభ్యర్థులకు స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా పని అనుభవం కూడా అవసరం.
వయోపరిమితి
2025 డిసెంబర్ 31 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వయోసడలింపు ఇలా ఉంటుంది:
ఓబీసీ అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు – 10 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు – రూ.750
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు – ఫీజు లేదు
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ఆధారంగా జరుగుతుంది:
ఆన్‌లైన్ రాత పరీక్ష
స్క్రీనింగ్
ఇంటర్వ్యూ
ఈ మూడు దశల్లో ప్రతిభ చూపిన వారికి తుది ఎంపిక కల్పిస్తారు.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,590 వరకు జీతం చెల్లిస్తారు. అదనంగా ఇతర బ్యాంకు అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
ముఖ్య గమనిక
బ్యాంకింగ్ రంగంలో రెగ్యులర్ ఉద్యోగం, మంచి వేతనం, కెరీర్ గ్రోత్ కోరుకునే అభ్యర్థులకు ఈ SBI సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ మంచి అవకాశంగా మారనుంది.
ఇవీ చదవండి: RRB isolated category jobs : రైల్వే ఐసోలేటెడ్ కేటగిరీ ఉద్యోగాలకు చివరి అవకాశం.. జనవరి 29తో దరఖాస్తుల గడువు ముగింపు
Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 7,673 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి సిద్ధం
