Viral video : సోషల్ మీడియా వచ్చాక “వైరల్ అవ్వాలి” అన్న కోరిక చాలామందిని ఏవేవో విన్యాసాలకు పురికొల్పుతోంది. కొందరు ఫన్నీ రీల్స్‌తో నవ్విస్తే, మరికొందరు మాత్రం హద్దులు దాటి ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకుంటున్నారు. అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
పైకప్పు అంచునుంచి వేలాడుతూ వ్యాయామం!
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు భవనం పైకప్పుపై నిలబడి ఉండటంతో మొదలవుతుంది. ముఖంలో ఏమాత్రం భయం లేదు. ఆ తర్వాత అతడు చేసిన పనితో చూసినవాళ్లందరూ షాక్‌కు గురయ్యారు.
పైకప్పు రెయిలింగ్ నుంచి సగం దూరం వేలాడుతూ… గోడకు అతుక్కున్నట్లే పుష్-అప్‌లు చేయడం మొదలుపెట్టాడు. జారిపడితే నేరుగా కిందపడే ప్రమాదం ఉన్నా, అదంతా అతనికి లెక్కలేనట్టుగా కనిపించింది. నెటిజన్స్ అయితే “ఇతను మనిషా? బల్లినా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
13 సెకన్ల వీడియో.. వేల వ్యూస్
ఈ ప్రమాదకర విన్యాసం ఉన్న వీడియో కేవలం 13 సెకన్లు మాత్రమే ఉన్నా, ఇప్పటికే 30 వేలకుపైగా వ్యూస్, వందల లైక్స్, కామెంట్లు వచ్చాయి.
కొందరు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతే, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
నెటిజన్స్ రియాక్షన్ ఇలా…
“ఇది వ్యాయామం కాదు… ఇది ప్రాణాలతో చెలగాటం”
“ఫిట్‌నెస్ పేరుతో ఇలా చేయడం మూర్ఖత్వం”
“రీల్ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టడం అవసరమా?”
“అయితే ప్రాక్టీస్ చేస్తే మనిషి ఇంత వరకు వస్తాడేమో”
అని విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ కోసం ప్రమాదకర ట్రెండ్?
ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో పెరుగుతున్న డేంజరస్ ఫిట్‌నెస్ ట్రెండ్స్పై చర్చ మొదలుపెట్టింది. వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే కానీ, ఇలా ప్రాణాలకు ముప్పు తెచ్చే విన్యాసాలు ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నను నెటిజన్స్ లేవనెత్తుతున్నారు.
ఇవీ చదవండి: Viral Video: నడి రోడ్డుపై హైడ్రామా.. భర్త లవర్‌ను పట్టుకుని ఉతికేసిన భార్య.. వీడియో వైరల్
Spirit : ఏం చేయబోతున్నావ్ అన్నా.. స్పిరిట్ నుంచి ప్రభాస్ మాస్ లుక్ పోస్టర్ వైరల్!
