HomeCinemaOTT Cinema: భర్తలను చంపేందుకు భార్యల డీల్… ట్విస్టుల మీద ట్విస్టులతో సాగే రివేంజ్ క్రైమ్...

OTT Cinema: భర్తలను చంపేందుకు భార్యల డీల్… ట్విస్టుల మీద ట్విస్టులతో సాగే రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Cinema: ఓటీటీ ప్రపంచంలో రోజుకొక కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ జానర్‌లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో విపరీతమైన ఆదరణ ఉంది. అలాంటి కోవలోకి వచ్చే ఓ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్‌గా మారింది.

ఇద్దరు భార్యలు… తమ భర్తలను చంపేయాలనే ఒక ప్రమాదకరమైన డీల్ కుదుర్చుకుంటారు. ఒకరి భర్తను మరొకరు హత్య చేయాలన్న ఈ ఒప్పందం నుంచే కథ అసలు మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత వరుసగా వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను చివరి వరకూ ఉత్కంఠలో ఉంచుతాయి. ఆద్యంతం థ్రిల్లింగ్ మూడ్‌లో సాగుతూ, ఊహించని సంఘటనలతో షాక్ ఇస్తుంది ఈ సిరీస్.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ వెబ్ సిరీస్ పేరు Karma Korma. ఇది బెంగాలీ భాషలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా. రివేంజ్ కథకు వంటలు, స్నేహం, రొమాన్స్ అంశాలను జోడించి డిఫరెంట్ నేరేషన్‌తో ఈ సిరీస్‌ను రూపొందించారు.

ఈ సిరీస్‌లో ప్రముఖ బెంగాలీ నటీమణులు Ritabhari Chakraborty, Sohini Sarkar కీలక పాత్రల్లో నటించారు. “కర్మ” అంటే మనం చేసిన పనుల ఫలితం… “కోర్మా” అంటే రుచికరమైన వంటకం. ఈ రెండు భావాలను కలిపి పదునైన క్రైమ్ థ్రిల్లర్‌గా మలిచారు దర్శకుడు Pratim D. Gupta.

వంటల ద్వారా మొదలైన ఇద్దరు మహిళల పరిచయం క్రమంగా స్నేహంగా మారుతుంది. ఆ స్నేహమే తరువాత పగ, ప్రతీకారం, హత్యల వైపు దారి తీస్తుంది. ఇప్పటికే భర్తలతో విసిగిపోయిన ఈ ఇద్దరు… వారిని ఎలాగైనా తమ జీవితాల నుంచి తొలగించుకోవాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం ఒకరి భర్తను మరొకరు చంపాలనే డీల్ ఫిక్స్ అవుతుంది. అదీ వంటల ద్వారానే హత్య చేయాలనే ప్లాన్. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఊహించని ట్విస్టులు, షాకింగ్ మలుపులతో కథ పూర్తిగా కొత్త దిశలో సాగుతుంది.

ప్రస్తుతం కర్మా కోర్మా సిరీస్ Airtel Xstream ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ప్రస్తుతం బెంగాలీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త తరహా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది.

ఇవీ చదవండి: Cinema : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న భయానక సినిమా.. రాత్రి ఒంటరిగా చూస్తే గుండె ఆగినట్టే!
OTT Movies : నవంబర్ చివరి వారం: థియేటర్‌, ఓటీటీలో ప్రేక్షకులను అలరించబోయే కొత్త మూవీస్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు