HomeTelanganaHyderabad: 60 ఏళ్ల పైలట్‌ అఘాయిత్య యత్నం… 26 ఏళ్ల తోటి పైలట్ ఫిర్యాదుతో కలకలం!

Hyderabad: 60 ఏళ్ల పైలట్‌ అఘాయిత్య యత్నం… 26 ఏళ్ల తోటి పైలట్ ఫిర్యాదుతో కలకలం!

Hyderabad: హైదరాబాద్ బేగంపేటలోని ఒక ప్రైవేట్ ఏవియేషన్ సంస్థలో పనిచేస్తున్న యువతి పైలట్‌పై ఆమె సహోద్యోగి, 60 ఏళ్ల కమర్షియల్ పైలట్ రోహిత్ శరణ్ అఘాయిత్యానికి యత్నించినట్టు ఆరోపణలు బయటపడ్డాయి. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఏవియేషన్ సర్కిల్స్‌లో తీవ్ర సంచలనం రేగింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బేగంపేట పోలీసులు ప్రాథమిక కేసు నమోదు చేశారు.

బెంగళూరులో జరిగిన ఘటన
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఆ ప్రైవేట్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఇద్దరు పైలట్లు ఇటీవల పని నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు. అక్కడ హోటల్ వసతి కల్పించిన సమయంలోనే రోహిత్ శరణ్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని 26 ఏళ్ల యువతి ఫిర్యాదులో పేర్కొంది.

సంఘటన సమయంలో పరిస్థితిని అంచనా వేసి వెంటనే గది నుండి బయటపడిన ఆమె, తక్షణమే హైదరాబాద్‌కు చేరుకుని బేగంపేట పోలీసులు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కేసు బెంగళూరుకు బదిలీ
బేగంపేట పోలీసులు ప్రారంభ విచారణలోనే ఈ ఘటన బెంగళూరు హలసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగినట్టు నిర్ధారించారు.
అందువల్ల కేసును సంబంధిత ప్రాంతానికి బదిలీ చేశారు. హలసూరు పోలీసులు ఇప్పటికే రోహిత్ శరణ్‌పై సంబంధిత IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

ఈ ఘటనపై ఏవియేషన్ ఇండస్ట్రీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఒక వృద్ధ పైలట్‌ ఇంతటి చర్యకు పాల్పడటం పట్ల ఉద్యోగిగా ఉన్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి: Bharat China : భారత్–చైనా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం: ఢిల్లీ–షాంఘై నాన్-స్టాప్ ఫ్లైట్ త్వరలో
Hyderabad: బాహుబలి విమానం ల్యాండ్! AN-124 రస్లాన్ ప్రత్యేకతలు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Plane Crash : జార్జియాలో ఘోర విషాదం: కూలిపోయిన టర్కీ C-130 సైనిక విమానం – 20 మంది మరణించినట్లు అనుమానం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు