Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. అతని మాజీ ప్రేయసి లావణ్య తాజాగా హైదరాబాద్‌లోని నర్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. (Raj Tarun)
లావణ్య ఫిర్యాదు వివరాలు
లావణ్య వాంగ్మూలం ప్రకారం జూన్ 30న రాజ్ తరుణ్, అతని స్నేహితులు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించారని తెలిపింది. వారు తన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని, అడ్డుకునే ప్రయత్నం చేసిన తన తండ్రిపై దాడి చేశారని, అంతేకాదు తన పెంపుడు కుక్కను చంపేశారని కూడా ఆరోపించింది.
పోలీసులు నమోదు చేసిన కేసు
ఈ ఫిర్యాదు మొదటగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు చేరగా, ఆయన ఆదేశాలపై నర్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్‌తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కేసు నమోదు చేశారు.
విల్లా వివాదం
2016లో రాజ్ తరుణ్‌తో కలిసి కోకాపేట్‌లోని ఒక విల్లాను కొనుగోలు చేసిన విషయాన్ని కూడా లావణ్య ప్రస్తావించింది. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని, తాము మాత్రమే అక్కడ ఉన్నామని తెలిపింది. ఈ మధ్యకాలంలో రాజ్ తరుణ్ అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేసి, బెల్టులు, గాజు సీసాలతో కొట్టారని, తన బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారని ఆరోపించింది. ప్రస్తుతం ఆ విల్లా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని కూడా పేర్కొంది.
గత వివాదాల జాడ
ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా రాజ్ తరుణ్, లావణ్యలు పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. లావణ్య, రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు వదిలేశాడని, మరో హీరోయిన్‌తో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ కోర్టు వరకు వెళ్లిన కేసు పెట్టింది. అప్పట్లో వారి గొడవలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మళ్లీ తెరపైకి వచ్చిన వివాదం
కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఈ వ్యవహారం, ఇప్పుడు లావణ్య కొత్త ఫిర్యాదుతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ తాజా ఆరోపణలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో ఇప్పుడు అందరి దృష్టి అతనిపై నిలిచింది.
ఇవీ చదవండి: Tollywood Heroine : అమ్మ మాట వినకుండా పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ ఎమోషనల్
Heroines: వ్యక్తిగత జీవితంలో అలాంటి జబ్బులతో బాధ పడుతున్న హీరోయిన్లు వీళ్లే!
