HomeBusinessGmail Hack: మీ జీమెయిల్ హ్యాక్ అయ్యిందా? గూగుల్ ఏం చెప్పిందంటే..

Gmail Hack: మీ జీమెయిల్ హ్యాక్ అయ్యిందా? గూగుల్ ఏం చెప్పిందంటే..

Gmail Hack: Gmail హ్యాక్ అయిందా? గత వారం నుండి సోషల్ మీడియాలో, కొన్ని వార్తా సైట్లలో “Gmail పెద్ద ఎత్తున హ్యాక్ అయింది” అనే వార్తలు వెలువడ్డాయి. గూగుల్ వార్నింగ్ మెసేజ్‌లు పంపడం, ఫిషింగ్ దాడులు పెరగడం ఈ ప్రచారానికి కారణమయ్యాయి. కానీ గూగుల్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. (Gmail Hack)

గూగుల్ వివరణ
తమ అధికారిక బ్లాగ్‌లో గూగుల్ స్పష్టంగా తెలిపింది – “Gmail సెక్యూరిటీ బలంగా, సమర్థవంతంగా ఉంది. బిలియన్ల ఖాతాలు హ్యాక్ అయ్యాయన్న వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారం” అని.

అసలు ఏం జరిగింది?
జూన్ నెలలో గూగుల్‌కు చెందిన కార్పొరేట్ సేల్స్‌ఫోర్స్ సర్వర్‌ను హ్యాక్ చేశారు.
అందులోని పబ్లిక్ బిజినెస్ కాంటాక్ట్స్, పేర్లు వంటి సమాచారం మాత్రమే బయటకు వెళ్లింది.
ప్రైవేట్ డేటా, యూజర్ల వ్యక్తిగత సమాచారం మాత్రం సేఫ్ గానే ఉంది.

ఫిషింగ్ దాడులు పెరగడం
జూలై, ఆగస్టు నెలల్లో ఫిషింగ్ దాడులు ఎక్కువయ్యాయి. గూగుల్ దీనిపై యూజర్లకు అలర్ట్‌లు పంపింది. దీనిని చాలా మంది మాస్ హ్యాకింగ్ అలర్ట్ అని భావించారు. దీంతో 2.5 బిలియన్ Gmail యూజర్లు హ్యాక్ అవుతారని ప్రచారం మొదలైంది.

గూగుల్ భరోసా
గూగుల్ ప్రకారం, Gmail‌లోకి వచ్చే 99.9% మాల్వేర్, ఫిషింగ్ మెసేజ్‌లు బ్లాక్ అవుతున్నాయి.
యూజర్లకు ఎటువంటి అదనపు రిస్క్ లేదని గూగుల్ తెలిపింది.
అయినప్పటికీ, ఫిషింగ్ ఇమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, పాస్‌కీ వాడాలని సూచించింది.

ఎందుకు నమ్మారు ప్రజలు?
ఇంటర్నెట్‌లో ప్రతి రోజూ డేటా లీక్‌లు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్ మార్చుకోవడం, అకౌంట్ రికవరీ చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. అందుకే Gmail హ్యాక్ వార్తలను ప్రజలు తక్షణమే నమ్మేశారు.

👉 మొత్తానికి, Gmail యూజర్లు భయపడాల్సిన అవసరం లేదని గూగుల్ స్పష్టం చేసింది. కానీ జాగ్రత్తగా ఉండటం, పాస్‌వర్డ్ మార్చడం, 2FA వాడడం ఎప్పటికీ మంచిదే.

ఇవీ చదవండి: Data Breach : గూగుల్ డేటా బ్రీచ్‌‌పై ఇన్వెస్టర్ల రియాక్షన్!
Pixel 10 Pro review : గూగుల్ పిక్సెల్ 10 ప్రో రివ్యూ.. AI పవర్‌తో ఫ్లాగ్‌షిప్ ఫోన్
Google MagSafe : గూగుల్ సొంత పిక్సెల్ స్నాప్ వచ్చేసింది
Google Gemini : గూగుల్‌ జెమినీ AI మరింత పర్సనలైజ్.. ఆటోమేటిక్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు