HomeCinemaActress : నటి అనుమానాస్పద మృతి.. 15 రోజులు కనపడకపోయేసరికి!

Actress : నటి అనుమానాస్పద మృతి.. 15 రోజులు కనపడకపోయేసరికి!

Actress : చక్కగా కనిపించే సినీ తారల జీవితం వెనుక ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయి. వెండితెరపై వెలుగులు పంచే వారు నిజజీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడుతూ, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటారు. అలాంటి ఉదంతమే ఇప్పుడు మళ్లీ ఒకసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన భారతదేశంలో కాదు.. పొరుగుదేశమైన పాకిస్తాన్లో జరిగింది. (Actress)

పాకిస్తానీ నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ (32) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మరణించిన సంగతిని మూడు వారాల తర్వాత తెలుసుకున్నారు. గత కొంతకాలంగా కరాచీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తూ వచ్చిన ఆమె, ఇటీవల ఎవరికి కూడా కనిపించకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి.

అద్దె చెల్లించకుండా చాలా రోజులు గడిపేయడంతో అపార్ట్‌మెంట్ ఓనర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు హుమైరా ఇంటికి వెళ్లారు. కాలింగ్ బెల్ కొట్టినా స్పందన లేకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు ఆమె శవాన్ని కనుగొన్నారు. అప్పటికే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది.

పూర్తిగా తలుపులు మూసుకొని ఉండటం, బయట ఎవరితోనూ సంప్రదింపుల్లేకపోవడంతో హుమైరా ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించగా, మృతదేహానికి పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు స్పష్టత ఇవ్వలేమని అధికారుల భావన.

లాహోర్‌కు చెందిన హుమైరా 2015లో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ‘జస్ట్ మ్యారెడ్’, ‘ఎహ్సాన్ ఫరామోష్’, ‘గురు’, ‘చల్ దిల్ మేరే’ వంటి టీవీ సీరియల్స్‌తో పాటు ‘జలైబీ’, ‘లవ్ వ్యాక్సిన్’ వంటి సినిమాల్లో నటించారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులున్నారు. హుమైరా ఆకస్మిక మరణం పాకిస్తాన్ సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇవీ చదవండి: Kylie Page : 200కు పైగా శృంగార చిత్రాలతో రికార్డు.. శవమై తేలిన నటి కైలీ పేజ్
Dhoni Relation : మహేంద్రసింగ్ ధోనితో రిలేషన్‌.. నటి సంచలన వ్యాఖ్యలు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు