HomeNationalModi on Operation Sindoor : పీవోకేను వదలడం తప్ప గత్యంతరం లేదు

Modi on Operation Sindoor : పీవోకేను వదలడం తప్ప గత్యంతరం లేదు

Modi on Operation Sindoor : పాకిస్తాన్ కు పీవోకేను వదలడం తప్ప మరో గత్యంతరం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరించారు. ఆపరేషన్ సిందూర్ ను ఉద్దేశించి మోదీ (Modi on Operation Sindoor) ఇవాళ సాయంత్రం జాతినుద్దేశించి మాట్లాడారు. మన బలగాలకు సెల్యూట్ అంటూ మోదీ చెప్పారు.

జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం ముఖ్యాంశాలు..

– మన బలగాలకు నా సెల్యూట్ : మోడీ
– ఆపరేషన్ సింధూర్ లో సాహోసోపేతమైన ప్రదర్శన చేశారు
– పాక్ కు పీవోకేను వదలడం తప్ప గత్యంతరం లేదు
– గడిచిన నాలుగు రోజులు భారత సైన్యం సామర్ధ్యాన్ని చూస్తున్నాం

– గడిచిన నాలుగు రోజులు భారత సైన్యం సంయమనాన్ని చూస్తున్నాం
– నిఘావర్గాల సామర్ధ్యం , శాస్త్రసాంకేతిక సామర్ధ్యాన్ని దేశం చూసింది
– మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది
– సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం చూసింది

– భారత రక్షణదళాలు చూపిన ధైర్యసాహసాలు దేశానికి తలమానికం
– పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ కుటుంబసభ్యుల ముందు కాల్చి చంపారు
– పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయింది
– ఉగ్రదాడి దాడులపై ప్రతి హృదయం జ్వలించిపోయింది

– పార్టీలు, పౌరులు అన్ని ఒక్కతాటిపైకి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి
– భారతీయ మహిళల నుదుటిపై సింధూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సింధూర్
– పాక్ లోని ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలు ధ్వంసం చేశాం
– ఉగ్రదాడి తర్వాత దేశం ఒక్కటిగా నిలిచింది

– పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం
– ఉగ్రవాదులను భారత క్షిపణులు, డ్రోన్ లు హతమార్చాయి
– గ్లోబల్ టెర్రరిజానికి బహావల్పూర్ ఒక యూనివర్సిటీ..అందుకే టెర్రరిస్ట్ లని చెండాడాం..ఆ వర్సిటీని నేలమట్టం చేశాం
– ఒక్క దెబ్బతో ఉగ్రనాయకులను చావుదెబ్బ కొట్టాం.

– కలలో కూడా భారత్ అంటే పాక్ ఉలిక్కిపడేలా చేశాం
– పాకిస్థాన్ అహంకారాన్ని దెబ్బతీసాం
– మనది దొంగదెబ్బ కాదు , పాక్ గుండెలపై దాడి చేశాం
– పాక్ తదుపరి చర్యలపై ఒక కన్నేసి ఉంచాం

– పాక్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదు..ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలో భారత్ కి బాగా తెలుసు
– పాక్ తోక జాడిస్తేపరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి
– పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి పహల్గామ్ దాడే నిదర్శనం
– భారత్ ఇప్పుడు కొత్త యుద్ధరీతుల్నీ అమలు చేస్తోంది

– మేడిన్ ఇండియా అస్త్రాలు వాడే సమయం వచ్చింది
– ఉగ్రవాదం అంతానికి ఎప్పటికప్పుడు కొత్త పంథా అనుసరిస్తాం
– యుద్ధం మా ప్రాధాన్యత కాదు.. అలాగని ఉగ్రవాదాన్ని సహించం

– ఉగ్రవాదాన్ని పోషిస్తే. ఏదో ఒకరోజు పాక్ అంతమైపోతుంది
– ఉగ్రవాదంపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవాల్సిందే
– ఉగ్రవాదం ఉన్నంత వరకూ శాంతి చర్చల ప్రసక్తే లేదు

– శాంతి -ఉగ్రవాదం , నీళ్లు -నెత్తురు ఒక్కచోట ఉండలేవు
– పాక్ తో చర్చలంటూ ఉంటే ఉగ్రవాదం, POKపై మాత్రమే జరుగుతాయి
– మతం పేరుతో మారణహోమం సృష్టించారు
– కేవలం మూడు రోజుల్లోనే పాక్ కాళ్లబేరానికి వచ్చింది
– ఇక పాక్ పరిధి దాటితే ఇలాంటి ప్రతిదాడే ఉంటుంది

ఇవీ చదవండి: India Pak War: పెద్దన్న రాయబారం.. ముగిసిన భారత్-పాక్ యుద్ధం!
US stopped nuclear conflict : భారత్-పాక్ యుద్ధాన్ని ఆపాం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. ఉగ్రమూకల హడల్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు