HomeAndhra PradeshPattabhi: ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది.. చంద్రబాబుకేం సంబంధం?

Pattabhi: ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది.. చంద్రబాబుకేం సంబంధం?

Pattabhi: జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోందని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhi) విమర్శించారు. జగన్-షర్మిల ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కిందని, వాళ్ల ఆస్తులతో చంద్రబాబుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు.

చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ చేసుకున్నారా? అని ప్రశ్నించిన పట్టాభి, తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠాగా విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉన్నారన్నారు. తాడేపల్లి ఇంటి నుంచి ఆదేశాలు రాగానే చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారిందని ప్రచారం చేస్తున్నారన్నారు.

జగన్ కు, తనకు మధ్య 2019లో ఒప్పందం కుదిరిందని షర్మిల చెబుతున్నారన్నారు. కానీ జగన్ ఆ ఒప్పందానికి కట్టుబడకుండా తనపైనా, తల్లిపైనా కేసు పెట్టినట్టు ఆమె ఆరోపిస్తున్నారని తెలిపారు. జగన్, షర్మిల కుటుంబ వ్యవహారాలో చంద్రబాబుకు ఏం సంబంధం? అని లేకపోతే, జగన్ తో చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేయించారా? అని సెటైర్లు వేశారు.

మీ నాయకుడు ఎవరికి చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు? సొంత తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చి రచ్చ చేసింది మీ నాయకుడేనన్నారు. పైగా… ఇది చాలా చిన్న విషయం… ఘర్ ఘర్ కీ కహానీ అని జగన్ అంటున్నారన్నారు. మీరు చేసే తప్పుడు పనులను అందరికీ ఆపాదించే ప్రయత్నం చేయొద్దని పట్టాభి కోరారు.

మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్.. రాజకీయాలకు అనర్హుడని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ లో బంగ్లా, లోటస్ పాండ్, బెంగళూరులో ప్యాలస్ లు జగన్ కు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. జగన్ జైలుకు వెళ్ళారు కానీ షర్మిల జైలుకి వెళ్ళలేదు కదా?.. షర్మిలకు ఆస్తుల్లో వాటా రాదని సుబ్బారెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు.

ఇదిలా ఉంటే సరస్వతీ పవర్ అక్రమాలపై ఏసీబీ, సీఐడీ విచారణకు ఆదేశించాలని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వైఎస్‌ అధికారాన్ని అడ్డంపెట్టుకుని రూ.లక్ష కోట్లకు పైగా జగన్ దోపిడీ చేశారని ఆరోపించారు. జగన్‌ ధన దాహానికి పరాకాష్ఠ సరస్వతీ పవర్ అన్నారు. పేదల జీవితాలు బలిపెట్టి అడ్డదారుల్లో రూ.10 వేల కోట్ల సంస్థకు అధిపతి అయ్యారన్నారు. 15 ఏళ్లయినా ఇటుకరాయి వేయని సంస్థలకు ఇంకా గనుల కేటాయింపులు ఎందుకు? అని ప్రశ్నించారు. సరస్వతీ పవర్‌కి సున్నపురాయి గనుల కేటాయింపులను సమీక్షించి, రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నందుకు జగన్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. సరస్వతీ పవర్‌ కంపెనీ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో పరిశ్రమ పేరిట రైతులు, ప్రజల నుంచి వందలాది ఎకరాలను తీసుకుని 15 ఏళ్లు గడుస్తున్నా.. నేటి వరకు పరిశ్రమ స్థాపించలేదన్నారు. ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ భూముల్ని రైతులకు కౌలుకు ఇచ్చే దిశగా ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ఇతర కంపెనీల భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం జగన్‌ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం వారికి భద్రత పెంచాలన్నారు.

ఇవీ చదవండి: YS Sharmila: షర్మిల కంట తడి.. అన్నపై హాట్ కామెంట్స్.. దౌర్భాగ్యుడు, శాడిస్ట్ అంటూ… పూర్తి ప్రసంగం ఇదీ
CM Chandrababu: ఇసుక, మద్యంలో జోక్యం వద్దు.. చంద్రబాబు వార్నింగ్
Chandrababu: జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి
CBN on Jagan Family issue: జగన్ ఫ్యామిలీ ఇష్యూపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు